బిగ్‌బాస్ కొత్త కెప్టెన్ ఎవ‌రంటే..

-

బిగ్‌బాస్ 3 సీజ‌న్ మంచి రస‌వ‌త్త‌రంగా సాగుతోంది. బిగ్‌బాస్ దాదాపు ప్రీ క్లైమాక్స్‌కు చేరుకుంటోన్న టైంలో ఆలీ రెజా మ‌ళ్లీ వైల్డ్ కార్డ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చాడు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌కు మొత్తం న‌లుగురు ఇంటి స‌భ్యులు ఎంపిక‌య్యారు. వీరిలో ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడ‌ళ్ల టాస్క్‌లో నెగ్గిన ర‌వి – శ్రీముఖి జంట‌తో పాటు ఆస్తి వీలునామా త‌న వ‌ద్ద‌నే ఉంచుకున్న అత్త జ్యోతితో పాటు టోట‌ల్ గేమ్‌లో బెస్ట్‌ ఫర్‌ఫార్మెన్స్‌ ఇచ్చిన‌ బాబా కూడా కెప్టెన్సీ టాస్క్‌లో తలపడనున్నారు.

ఇక వీరికోసం బిగ్‌బాస్‌ ‘కలర్‌ఫుల్‌ కెప్టెన్‌’ టాస్క్‌ ఇచ్చాడు. నాలుగు వేర్వేరు రంగులు నింపిన పాత్రలను ఇచ్చాడు. ఈ టాస్క్‌లో వారంతా ఇంటిని చిందరవందరగా మార్చుతూ చెలరేగిపోయినట్టు కనిపిస్తోంది. ఒకరు తప్పించుకోడానికి ప్రయత్నిస్తుంటే మరొకరు వారిని దొరకబుచ్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

మ‌రి ఈ నలుగురిలో ఎవరు కెప్టెన్‌ అవుతారో చూడాలి! ఇప్పటివరకు రవి, శ్రీముఖికి ఒక్కసారి కూడా కెప్టెన్‌ అవలేదు. రవి అయితే కనీసం కెప్టెన్సీ టాస్క్‌ వరకు కూడా వెళ్లలేదు. మరి ఈ టాస్క్‌లో ఎవరికి రంగు పడుద్దో ఎవరు కెప్టెన్‌ అవుతారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news