దాహం వేస్తే మంచినీళ్లు తాగడానికి బదులు కూల్డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారు. ప్రతి ఒక్కరూ కూల్డ్రింక్ చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే గబగబా గ్లాస్ లో కూల్డ్రింక్ ఇచ్చి కుసలప్రశ్నలు వేస్తారు. అంతేనా ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే గ్లాస్ లో కూల్డ్రింక్ చేతికి ఇచ్చి వెల్కమ్ డ్రింక్ అంటున్నారు. ఇలా కూల్ డ్రింక్ ను రోజువారి ఆహారంలో ఒక భాగాన్ని చేసేసామనే చెప్పాలి.
కానీ ఇది ఎంత వరకు అవసరం. ప్రతీ దానికీ కూల్ డ్రింక్ వాడటం మంచిది కాదు. చాలా మంది భోజనం చేసేటప్పుడు కూడా మంచినీళ్లు తాగడానికి బదులు డ్రింక్స్ నే తాగుతున్నారు. మరి ముఖ్యంగా బిర్యానీ తినేటప్పుడు అయితే కూల్ డ్రింక్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇలా మారిపోయాయి ఆహారపు అలవాట్లు. చాలా మంది ఇలా తాగడం వల్ల కడుపు తేలిక అవుతుంది అని అంటుంటారు.
అయితే వాస్తవానికి భోజనం చేసేటప్పుడు లేదా బిర్యాని తినేటప్పుడు కూల్ డ్రింక్ తాగడం అనేది అస్సలు మంచిది కాదు అని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి కూల్ డ్రింక్ తో ఆహారం అరగకపోగా జీవక్రియ ఆలస్యం అవుతుందని హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్ లో ఉండే కార్బోనేట్ సహా ఇతర రసాయనాలు కడుపులోకి వెళ్ళగానే బరువు తగ్గి తేలికైన భావన కలుగుతుంది.కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు.
అపోహ మాత్రమే అని ఆహార నిపుణులు అంటున్నారు. పైగా ఇలా కూల్ డ్రింక్ తో పాటు ఆహారం తీసుకోడ౦ వల్ల బరువు కూడా పెరుగుతారు అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ అలవాటు ఉన్నవారు తినేటప్పడు కొంచెం ఆలోచిస్తే మంచిది.