ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇన్నిరోజులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి గురువారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. దీంతో ఢిల్లీ ఎన్నికల కమిషన్ శరవేగంగా పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేయిస్తున్నది.
ప్రచారం జరిగిన తీరును పరిశీలిస్తే ఆప్, బీజేపీ పార్టీల మధ్యనే గట్టి పోటీ ఉన్నట్లు కనిపిసున్నది. ఆప్ తరఫున సీఎం కేజ్రివాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిషోడియా జోరుగా ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించారు. వీరి ప్రచారం మొత్తం బీజేపీని లక్ష్యంగా చేసుకుని కొనసాగింది. అటు బీజేపీ సైతం ఆప్‌నే టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహించింది. బీజేపీ తరఫున ప్రధాని మోడీ, అమిత్‌షా, రాజనాథ్‌సింగ్‌తోపాటు పలువురు మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రచారం చప్పగా సాగింది. రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ కొన్ని సభల్లో పాల్గొన్నా కాంగ్రెస్ ప్రచారంలో పస లేనట్లే కనిపించింది.
మరోవైపు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే 19,000 మంది హోంగార్డులను, 42,000 మంది ఢిల్లీ పోలీసులను ఆయా పోలీంగ్ బూత్‌లకు పంపింది. ఇక షాహీన్‌బాగ్ ఏరియాలో ఉన్న 5 పోలింగ్ కేంద్రాలూ సమస్యాత్మకమైనవిగా ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇదిలావుంటే ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగనుండగా, ఫిబ్రవరి 11న ఓట్లను లెక్కిస్తారు.