శాఖాహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అందరికి తెలిసిందే, మాంసాహారం అవసరం లేకుండా, శాఖాహార ఆహారాన్ని స్వీకరిస్తూ,ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే శాఖాహారంలో కొన్ని సూపర్ ఫుడ్స్ శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తాయి. కొంతమంది మాంసాహారం తినడానికి ఇష్టపడరు కానీ వారి ఆరోగ్య సమస్య వస్తే మాంసాహారం తినమని కొందరు చెబుతూ ఉంటారు కానీ మాంసాహారం ఇష్టపడిని వారు శాఖాహారంలోనూ అలాంటి ప్రోటీన్లు ఇచ్చే ఫుడ్స్ ను తీసుకుంటే సరిపోతుంది. మరి మాంసాహారానికి సమానమైన పోషక విలువలు కలిగిన శాఖాహార ఫుడ్స్ కొన్ని గురించి మనము తెలుసుకుందాం..
శెనగలు: శెనగలు ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల శనగలు 19 గ్రాముల ప్రోటీన్స్ ను కలిగి ఉంటుంది. ఇది మాంసాహారంతో సమానమైన శక్తినిస్తుంది, కూరలు లేదా స్నాక్స్ వంటి వాటితో వీటిని కలిపి తీసుకోవచ్చు. ఇవి గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తాయి.
క్వినోవా : క్వినోవా ఒక పరిపూర్ణ ఆహారంగా భావించవచ్చు ఇది తొమ్మిది ఆమ్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ ను అందిస్తాయి. 100 గ్రాముల క్వినోవాలో సుమారు 14 గ్రాముల ప్రోటీన్ ఫైబర్ మెగ్నీషియం ఐరన్ కలిసి ఉంటాయి. మాంసాహారంతో సమానమైన శక్తిని ఇచ్చే గొప్ప ఆహరంగా దీనిని భావించవచ్చు. ఈ క్వినోవా ను అన్నంలా వండుకొని తినవచ్చు.
బాదం: మనకి ఎంతో శక్తినిచ్చే డ్రై ఫ్రూట్స్ లో ఒకటైనది బాదం. ఇందులో ఆరోగ్యకరమైన విటమిన్ ఇ, మెగ్నీషియం ప్రోటీన్స్ ఉంటాయి. 100 గ్రాముల బాదంలో 21 గ్రాముల ప్రోటీన్ శక్తి ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడదంలో బాదం ఎంతో తోడ్పడుతుంది. బాదంపప్పు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు, లేదంటే బాదం పాలు తాగవచ్చు. ఇంకా స్నాక్స్, స్మూతీలలో బాదం పొడి కలుపుకొని తీసుకోవచ్చు.
బ్రోకోలి : బ్రోకోలిలో విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చూడడానికి క్యాలీఫ్లవర్ మాదిరి ఉంటుంది. 100 గ్రాముల బ్రొకోలీలో ఎన్నో ప్రోటీన్స్ ఉన్నాయి. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది అంతేకాక రోగ నిధుల శక్తిని పెంచుతుంది. ఈ బ్రోకోలిని సూప్ లలో లేదా సలాడ్స్ లో కలిపి తీసుకోవచ్చు.
చియా సీడ్స్: చియా సీడ్స్ లో ఒమేగా-3, ఫ్యాటీ ఆసిడ్స్, ఫైబర్, క్యాల్షియం ఇంకా ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్నాయి. 100 గ్రాముల చియార్ సీట్స్ లో 17 గ్రా. ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాక మనకెంతో శక్తిని అందిస్తాయి. వీటిని స్నాక్స్ లాగా లేదా ఏదైనా వంటల్లో కలిపి వండుకొని తినవచ్చు.
ఈ ఐదు సూపర్ ఫుడ్స్ శాఖాహారులకు మాంసాహారానికి సమానమైన పోషకాలను అందిస్తాయి. వీటిని రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
(గమనిక : పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే )