ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారా? ఉదయం లేవగానే ఈ పనులు చేయండి.

ఈ కరోనా మహమ్మారి కాలంలో పెరుగుతున్న చాలా సమస్యల్లో ఊబకాయం ఒకటి. చిన్న పెద్ద ముసలి అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం ఇతర వ్యాధులకు దారి తీస్తుంది. గుండెజబ్బులు, మధుమేహం, ఆస్థియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు ఇది కారణం అవుతుంది. అధిక కేలరీలు గల ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఊబకాయ సమస్యలు పెరుగుతున్నాయి.

దీన్ని నియంత్రించడానికి ఉదయం చేయాల్సిన కొన్ని పనులు చేయాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.

ఖాళీ కడుపుతో నీరు తాగండి

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీళ్ళు తాగాలి. దీనివల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకి వెళ్తాయి. శరీర జీవక్రియ సరిగ్గా పనిచేస్తుంది. క్రమంగా ఊబకాయం తగ్గుతుంది.

నడక

ఊబకాయాన్ని తగ్గించడానికి మరో చక్కటి మార్గం ఏదైనా ఉందంటే అది నడకే. ఉదయం లేవగానే కొద్దిసేపు నడక మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేలరీలు కరుగుతాయి. రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అంతేకాదు నడక ద్వారా ఆరోగ్యంగా ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అన్నింటికంటే అది చాలా ముఖ్యం.

వేగమైన నడక

నడక మొదట్లో మెల్లగా ప్రారంభించి, ఆ తర్వాత దాని వేగం పెంచాలి. వేగమైన నడక అధిక కేలరీలను కరిగించడంలో సాయపడుతుంది. దీనివల్ల అతికొద్ది రోజుల్లోనే మీరు ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. బరువు తగ్గడానికి ఇది మంచి వ్యాయామంగా పనిచేస్తుంది.

వీటిని ముట్టుకోవద్దు

బరువు పెంచే అధిక కేలరీలున్న కుకీలు, కేకులు, మఫిన్లు, ఉప్పగా ఉండే ఆహారాలు, స్నాక్స్ మొదలగు వాటిని ఆహారంలో చేర్చుకోవద్దు. ఇవన్నీ పాటిస్తుంటే ఊబకాయాన్ని తగ్గించవచ్చు.