హాట్ ఫోటోస్‌తో సెగలు రేపుతోన్న వాణీకపూర్

బాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే వాణీ కపూర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 8 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకూ నాలుగు సినిమాల్లో మాత్రమే ఆమె కనిపించారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆరబోతకే ప్రధాన్యమిస్తున్నారట.

తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్ వేదికగా వాణీకపూర్ బికినీలో దర్శనమిచ్చారు. ఒడ్డున కూర్చుని తన అందాలను ఆరబోశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అమ్మడి అందాలను చూసిన నెటిజన్స్ వావ్ అని అంటున్నారు.

తొలుత వాణీకపూర్ మోడలింగ్ చేశారు. ఆ తర్వాత యాక్టింట్‌లోకి అడుగుపెట్టారు. మోడలింగ్‌లో తనకున్న అనుభవాన్ని వాణీకపూర్ సినిమాల్లో ఫుల్లుగా వాడేసుకుంటున్నారు. తన మొదటి ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ సినిమాతోనే బోల్డ్ యాక్టర్‌గా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ‘బేఫికర్‌’లో నటించారు. ఇక ‘ఆహా కళ్యాణం’ అనే తమిళ్ సినిమాలోనూ తన అందచందాలతో అదరొగట్టారు.

రీసెంట్‌గా ‘వార్’ మూవీతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం బెల్ బాటమ్, షంషేరా, చండీఘర కరే ఆషీఖీ లాంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈగ్యాప్‌లో డోస్ మరింత పెంచడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.