అక్కడి ప్రజలు గర్భంతో ఉన్నప్పుడు చేపలు తినరు.. తింటే బిడ్డకు చేప తల వస్తుందట..!

మూఢనమ్మకాలు కేవలం.. చదువుకోని వాళ్లే నమ్ముతారు అనుకుంటారు.. కానీ చాలా దేశాల్లో.. పెద్ద పెద్ద చదువులు ఉన్న వారు కూడా.. కొన్నింటిని నమ్ముతారు. ఇలాంటివి నమ్మడానికి ప్రధాన కారణం.. దెయ్యాలు. ఇవి ఉన్నాయని భయంతో చాలా వాటిని నమ్మాల్సి వస్తుంది. ఎందుకొచ్చిన గోల.. పెద్దోళ్లు చెప్పింది చేస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ కొన్ని నమ్మకాలు మరీ విడ్డూరంగా ఉంటాయి. గర్భిణీగా ఉన్నప్పుడు చేప తింటే.. పుట్టే బిడ్డకు చేప తల వస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారట.. ఇంకా ఇవి కూడా..!

రాత్రి భోజనానికి టేబుల్ దగ్గర కూర్చొని పాడొద్దని నెదర్లాండ్స్ ప్రజలు చెబుతారు. అలా పాడితే.. మీ ఆహారాన్ని తినమని దెయ్యాన్ని కోరినట్లేనట.

ఐర్లాండ్‌లో వధువులు… బెల్స్ ఉన్న డ్రెస్ వేసుకుంటారు. ఆ గంటల చప్పుడు వల్ల దెయ్యాలు రావనీ, అందువల్ల తమ పెళ్లికి సమస్యలు రావని నమ్మతారు.

కెనడాలో కొందరు మహిళలు గర్భంతో ఉన్నప్పుడు చేపల్ని తినరు. అలా తింటే పుట్టే బిడ్డకు చేప తలతో పుడుతుందని నమ్ముతారు.

రువాండా మహిళలు మేక మాంసం తినరు. తింటే ముఖంపై వెంట్రుకలు వస్తాయి అనుకుంటారు.

కొరియాలో కొందరు మహిళలు.. గర్భంతో ఉన్నప్పుడు… ఉండాల్సిన ఆకారంలో లేని పండ్లను తినరు. అలాంటివి తింటే పుట్టే బిడ్డ అందవికారంగా పుడుతుందని వారి నమ్మకం.

తుఫాను వస్తున్న సమయంలో ఎరుపు డ్రెస్ ధరించవద్దన్నది ఫిలిప్పీన్స్ ప్రజలు అంటారు.. ఎరుపురంగు… పిడుగుల్ని ఆకర్షిస్తుందని వారి నమ్మకం.

కొత్త సంవత్సరం నాడు ద్రాక్ష తినాలట. ఒకటి తర్వాత ఒకటిగా 12 నల్ల ద్రాక్ష తినాలట. అలా చేస్తే మంచి జరుగుతుందన్నది స్పెయిన్ ప్రజల విశ్వాసం.

డిన్నర్ టేబుల్‌పై మూలకు కూర్చోవద్దని రష్యా, హంగేరీ ప్రజలు చెబుతారు. అలా కూర్చుంటే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని వారి నమ్మకం.

ఇంట్లో గొడుగు తెరవవద్దని ఈజిప్ట్, బ్రిటన్ ప్రజలు చెబుతారు. ఇంట్లో తెరిస్తే దురదృష్టం… వర్షంలా కురుస్తుందట..

పోర్చుగల్ ప్రజలు వెనక్కి నడవరు. అలా నడిస్తే దురదృష్టం పట్టుకుంటుందని నమ్ముతారు. అలా నడిస్తే… మీరు వెళ్లే దారిని దెయ్యానికి చూపించినట్లే అని వీర మాట.

పూర్వం మహిళలు ఆస్పత్రులకు వెళ్లేందుకు బుధవారం సరైన రోజుగా భావించేవారు. ముఖ్యంగా వివాహితలు దీన్ని బాగా నమ్మేవారు

ఒకే పదాన్ని, ఒకేసారి మీరు, మీ ఫ్రెండ్ ఇద్దరూ అనకూడదట. అలా అంటే పెళ్లి జరగదు ఇటలీలో దీన్ని నమ్ముతారు. ఒకవేళ అంటే.. వెంటనే ఎవరి ముక్కును వారు ముట్టుకుంటే సమస్య ఉండదట. భలే క్రేజీగా ఉంది కదా..! మన దగ్గర అంటే చుట్టాలు వస్తారు అంటుంటారు.

కొందరి కంటి చూపు ప్రమాదకరంగా ఉంటుందట. వారు చూసే ఇళ్లు, వాహనాలు ఏవైనా సరే వాటికి ఏదో ఒక చెడు జరుగుతుందట. అందుకే ఇళ్ల ముందు నిమ్మకాయలు, ఎండుమిర్చిని వేలాడదీస్తారు.

ప్రతి నెలా మొదటి రోజున ర్యాబిట్ ర్యాబిట్ అనిగానీ లేదా… వైట్ ర్యాబిట్ అని గానీ అంటే ఆ నెలంతా మంచి జరుగుతుందని బ్రిటన్, అమెరికా ప్రజలు నమ్ముతారు. మరి దీని వెనుక రిజన్ ఏంటో మనకు తెలియలా..!

-Triveni Buskarowthu