పైనాపిల్ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే…!

-

పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు తియ్యగా, పుల్లగా భలే రుచిగా ఉంటుంది. ప్రతి రోజు డైట్ లో తప్పకుండా ఏదో ఒక పండ్లని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే మీరు పైనాపిల్ తీసుకున్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పైనాపిల్ వల్ల ప్రయోజనాలు ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా..? మరి వాటి కోసం ఇప్పుడే తెలుసుకోండి.

ఒత్తిడి ఆందోళనకు ఎక్కువగా గురవుతున్న వారు పైనాపిల్ రసాన్ని తీసుకుంటే చాలా మంచిది. పైనాపిల్ జ్యూస్ రూపం లో గానీ పండ్ల రూపం లో గాని తీసుకున్నా పర్వాలేదు. ఇందులోని సోడియం, పొటాషియం ఉండడం వల్ల టెన్షన్ ని తగ్గిస్తుంది. అలానే పైనాపిల్ లో విటమిన్ సి యాంటీ బయాటిక్ గా పని చేస్తుంది. అలాగే చిన్న పిల్లలకు తగినంత పాలు లభించక పోయినట్లయితే అనాస పండు రసం ఇవ్వమంటారు వైద్యులు.

చిగుళ్లు, పళ్ల నుంచి రక్తం వచ్చి ఇబ్బంది పడే వాళ్లు ఈ పండు తీసుకుంటే చాలా మంచిది. గొంతు నొప్పి నుండి బయట పడాలంటే కూడా దీనిని తీసుకోవచ్చు. పచ్చ కామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధి ఉన్నవారు ప్రతి రోజూ తాగితే మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా పైనాపిల్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. పైనాపిల్ జ్యూస్ తీసుకుని ముఖానికి పట్టించి కాసేపు ఉంచుకొని పూర్తిగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటి తో శుభ్రం చేసుకుంటే వయసు ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలానే నిగారింపు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news