ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. తొలి నాలుగు గంటల్లోనే 40 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 50 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. అత్యల్పంగా చిత్తూరు జిల్లాలో 30 శాతం పోలింగ్ నమోదైంది. ఇక జిల్లా వారీగా ఈ ఈ మేరకు నమోదైంది.
మూడో విడత ఉదయం 10.30 కి పంచాయితీ ఎన్నికల్లో 40.29 శాతం పోలింగ్ నమోదయింది. విజయనగరం లో అత్యధిక.. చిత్తూరులో అత్యల్ప పోలింగ్ జరిగింది. జిల్లాల వారీ పోలింగ్ ఇలా ఉంది. శ్రీకాకుళం 42.65, విజయనగరం 50.7, విశాఖ 43.35, ఈస్ట్ గోదావరి 33.52, వెస్ట్ గోదావరి 32, కృష్ణా 38.35, గుంటూరు 45.90, ప్రకాశం 35.9, నెల్లూరు 42.16, చిత్తూరు 30.59,కడప 31.73, కర్నూలు 48.73, అనంతపురం 48.15 మేర పోలింగ్ జరిగింది.