ప్రపంచ న్యూమోనియా దినోత్సవం.. తెలుసుకోవాల్సిన విషయాలు..

న్యూమినియా కారణంగా ఇండియాలో ప్రతీ ఏటా 3.7లక్షల మంది చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ శాతం శిశువులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటున్నారు. దీని ప్రభావం చాలా తక్కువ నుండి తీవ్రంగా ఉంటుంది. న్యూమోనియా ప్రభావం అంతగా లేనపుడే డాక్టరుని సంప్రదించడం మంచిది. న్యూమోనియా రావడానికి బాక్టీరియా, వైరస్, ఫంగస్ లు కారణాలు.

బాక్టీరియా ద్వారా న్యూమోనియా సోకితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వైరస్ ద్వారా వచ్చే న్యూమోనియా అంత తీవ్రంగా ఉండదు. ఫంగస్ ద్వారా న్యూమోనియా తాకితే దాని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండి ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశం ఉంటుంది.

న్యూమోనియా లక్షణాలని ఒకసారి గమనిస్తే,

ఈ లక్షణాలనేవి ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటాయి. అలాగే వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఒకలా ఎక్కువగా ఉన్నప్పుడు మరోలా ఉంటాయి.

ముఖ్యమైన లక్షణాలు:

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
తీవ్రమైన దగ్గు, ఒక్కోసరి దగ్గులో రక్తం పడటం.
జ్వరం, వణకడం, చలి పెట్టడం,
ఛాతి నొప్పి, అలసిపోయినట్లు అనిపించడం

ఈ లక్షణాలు కనిపించినపుడు డాక్టరుని సంప్రదించాలి. అదే తగ్గుతుంది కదా అని ఊరుకుంటే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. న్యూమోనియా రాకుండా, వచ్చినపుడు ఎలాంటి జాగ్రత్త పడాలో ఇక్కడ తెలుసుకుందాం.

డాక్టరు చేత వ్యాక్సిన్ వేయించుకోవాలి. చిన్నపిల్లలని, వృద్ధులని చలి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలోకి తీసుకెళ్ళరాదు. వ్యక్తిగత శుభ్రత ఖచ్చితంగా పాటించాలి. చేతులు కడుక్కోవడం, రోజూ స్నానం చేయడం మరువద్దు. సబ్బు లేని పక్షంలో శానిటైజర్ వాడాలి. రోజూ ఉదయాన్నే 30నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలి. సరైన తిండి, సరైన నిద్ర తప్పనిసరి. ఈ జాగ్రత్తలు పాటించి న్యూమోనియాకి దూరంగా ఉండాలి.