బంగాళదుంపతో ఈ సమస్యలు మాయం…!

బంగాళదుంప చాలా మందికి ఫేవరేట్. పైగా అనేక వంటల్లో కూడా మనం దీనిని ఉపయోగిస్తూనే ఉంటాం. దీనిలో కేవలం కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు మాత్రమే ఉండవు. మరెన్నో పదార్థాలు దీంట్లో ఉంటాయి. అయితే మరి అవి ఏమిటి వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..! మరి ఇక ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. బంగాళదుంప లో బరువు పెరగడానికి కొన్ని ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సన్నగా ఉన్నవాళ్లు దీనిని తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు.

ఇది చాలా తేలికగా అరిగిపోతుంది. పిల్లలకి, పేషెంట్లు కి దీనిని పెట్టడం వల్ల సులువుగా ఇది అరుగుతుంది. పైగా శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్స్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్ మరియు జింక్ చర్మానికి ఎంత గానో మేలు చేస్తాయి. కనుక చర్మ సంరక్షణకు వీటిని ఉపయోగించ వచ్చు. దీనిని క్రష్ చేసి ఫేస్ ప్యాక్ లో ఉపయోగించిన కూడా చాలా మేలు కలుగుతాయి.

కడుపు లో మంటను తగ్గించడానికి బంగాళ దుంప బాగా పని చేస్తుంది. అంతే కాదండి నోటి క్యాన్సర్ కు చికిత్స గా కూడా దీనిని ఉపయోగించ వచ్చు. పచ్చి బంగాళదుంప ముద్దని కాలిన గాయాలకు రాస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. గుండె జబ్బులు తగ్గించడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది. బంగాళాదుంపలు ఉడికించి నీళ్ళు కీళ్ళ నొప్పులకు బాగా పని చేస్తాయి.