ప్రొటీన్ పౌడర్లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఎలాగంటే?

-

ఈరోజుల్లో మనకు ఇమ్యునిటీ పవర్ ఎంత అవసరమో మనందరికి తెలుసు.. దీనికోసం రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటాం. దాంతోపాటు.. శరీరానికి మేలు చేసే ప్రోటీన్ కూడా మనకు అవసరం. ఎదిగే వయసు పిల్లలకు ప్రోటీన్ చాలా ముఖ్యం. ప్రోటీన్ ఉన్న ఆహారం పిల్లలు నచ్చదు. వాళ్లకు నచ్చనది పెడితే ఏడుస్తారు. ఇక అందరూ ప్రోటీన్ పౌడర్ మీద పడతారు. మార్కెట్ లో దొరికే ప్రోటీన్ పౌడర్స్ టేస్టీగానే ఉన్నప్పటికి అందులో కెమికల్స్ ఉంటాయి. వాటి ఖరీదు కూడా ఎక్కువే ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.

ఇంట్లో తయారు చేసుకున్న ప్రొటీన్ పౌడర్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్ అన్నీ హెల్దీ గా ఉండేవి ఎంచుకుంటాం కాబట్టి మనకు ఎలాంటి భయం ఉండదు. ఇప్పుడు వివిధరకాల ప్రోటీన్ పౌడర్స్ ని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

ప్రొటీన్ పౌడర్ 1;
కావలసిన పదార్థాలు: బాదం: 1 కప్పు,
వాల్‌నట్‌: అర కప్పు,
పిస్తా పావు కప్పు,
జీడిపప్పు పావు కప్పు,
గుమ్మడి విత్తనాలు 2 టేబుల్‌ స్పూన్లు,
పుచ్చ విత్తనాలు 2 టేబుల్‌ టీస్పూన్లు,
పొద్దు తిరుగుడు విత్తనాలు 2 టేబుల్‌ స్పూన్లు,
ఓట్స్‌ అర కప్పు,
షియా విత్తనాలు 2 టేబుల్‌స్పూన్లు,
పాల పొడి అర కప్పు

ఎలా చేయాలంటే..

బాదం పప్పును చిన్న మంట మీద కమ్మని వాసన వచ్చే వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో పిస్తా, వాల్‌నట్‌, జీడిపప్పు కలిపి వేయించి, పక్కన పెట్టండి. గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలు వేసి, సువాసన వచ్చే వరకూ వేయించి, పక్కన పెట్టుకోవాలి. ఓట్స్ ను కూడా కరకరలాడే వరకూ వేయించి తీయాలి. వేయించుకున్న వాటికి షియా విత్తనాలు జోడించి, అన్నీ కలిసేవరకూ తిప్పండి. ఇవన్నీ చల్లారిన తర్వాత, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయండి. ఈ పొడిని జల్లించుకుని, పాల పొడి కలుపుకుంటే ప్రొటీన్‌ పౌడర్‌ రెడీ.

ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుని, రెండు నెలల లోపు వాడుకోవాలి. ప్రొటీన్‌ మిల్క్‌ కోసం రెండు కప్పుల పాలను వేడి చేసి, తయారుచేసి పెట్టుకున్న ప్రొటీన్‌ పౌడర్‌ 3 స్పూన్లను వేసి, బాగా కలుపుకోని తాగడమే.!

టైప్ 2;

కావాల్సిన పదార్ధాలు ;
నో ఫ్యాట్ మిల్క్ పౌడర్ – 3 కప్పులు,
డ్రై ఓట్స్ – 1 కప్పు,
బాదం పప్పు – 1 కప్పు,
కొద్దిగా బెల్లం లేదా పంచదార
ఒక పావు కప్పు కోకోవా పౌడర్

తయారీ విధానం

వీటన్నింటినీ కలిపి మిక్సీలో పొడి చేసి గాలి చొరని డబ్బాలో పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. ఇది ప్రతి రోజూ వాడితే ఎంతో మంచిది. ఒక అర కప్పు ప్రొటీన్ పౌడర్ లో 180 క్యాలరీలూ, 12 గ్రాముల ప్రొటీన్ ఉంటుందట. ఈ పౌడర్ ని పాలలో కలిపి తాగచ్చు, లేదా స్మూతీల్లో, షేక్స్ లో కలిపి కూడా వేయొచ్చు.

ప్రొటీన్ పౌడర్ 3;

కావాల్సిన పదార్ధాలు ; వంద గ్రాముల చొప్పున ఓట్స్, పీనట్స్, ఆల్మండ్స్, సోయా తీసుకోండి. యాభై గ్రాముల పాల పొడి తీసుకోండి.

పాల పొడి తప్ప మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసి చల్లార్చండి. ఇప్పుడు మిక్సీలో ఇవన్నీ వేసి, పాల పొడి కూడా కలిపి పొడిగా మిక్సీ పట్టండి. ఆ పొడిని జల్లించి మెత్తటి పౌడర్ ని స్టోర్ చేసుకోండి.

పౌడర్ 4:

ఈ పద్ధతిలో బాదం, జీడిపప్పూ, పిస్తా పప్పూ అర కప్పు చొప్పున తీసుకోండి. అర టీ స్పూన్ చొప్పున జాజికాయ పొడి, చిటికెడు పసుపు, కుంకుమ పువ్వూ తీసుకోండి.

పప్పుల్ని విడివిడిగా డ్రై రోస్ట్ చేసి చల్లారనివ్వండి. కుంకుమ పువ్వుని కూడా కొద్దిగా రోస్ట్ చేయండి.. పప్పులూ, కుంకుమ పువ్వూ కలిపి మిక్సీలో పొడి చేయండి. అందులో పసుపు, జాజికాయ పొడి కలిపి మరొక్కసారి మిక్సీ లో కలపండి. ఈ పౌడర్ కొంచెం అంటుకునేటట్లు ఉంటుంది.

వీటిల్లో మీకు సులవైన పద్దతి ఎంచుకుని ఎంచక్కా ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ చేసేసుకోండి. అయితే ప్రోటీన్లు పౌడర్ వాడేముందు డాక్టర్లను ఓసారి సంప్రదించండి. మీ శరీరానికి ఎంత మేర అవసరమో చెప్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version