జనరిక్ మెడిసిన్ వదిలేసి బ్రాండెడ్ మందులు కొంటున్నారా..?

-

ప్రజల అవగాహనా రాహిత్యం, వైద్యుల ప్రోత్సహం.. వెరసి చవకగా లభించే జనరిక్‌ మందులకు చెప్పుకోదగ్గ ఆదరణ లభించడం లేదు. వేలకు వేలు ఖర్చుచేసి మరీ ఖరీదైన మందులు కొంటున్నారు. అతి తక్కువ ధరకు ఔషధాలను అందించే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్ మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని మన దేశంతో పాటు చైనా తదితర దేశాల్లో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తున్నారు. మూడు రకాల్లో ఉత్పత్తి అయ్యో ఈ మందుల్లో మొదటి రకం ప్రభుత్వ దవాఖానాలు, వైద్య సంస్థలలో మాత్రమే దొరుకుతాయి. రెండు.. ట్రేడ్‌ జనరిక్‌. వీటిని ట్రేడ్‌ ఫార్మసిస్టులు పంపిణీ చేస్తారు. వీటికి పరిశోధన, నాణ్యత లాంటి ప్రమాణాలేం ఉండవు. మూడు.. బ్రాండెడ్‌ జనరిక్‌. వీటికి మాత్రం బ్రాండ్‌ పేరు ఉంటుంది.

జనరిక్ మందులు
జనరిక్ మందులు

జనరిక్‌ మందులు నాణ్యమైనవేనా?
జనరిక్‌ అయినా బ్రాండెడ్‌ అయినా తయారీ నాణ్యత, పనితీరు ఒకే విధంగా ఉంటాయి. తయారీలోనూ, మార్కెటింగ్‌లోనూ అదనపు ఖర్చు ఉండదు కాబట్టే, ఇది సాధ్యపడుతుంది. కాలపరిమితి ముగియటంతో మొదటి ఉత్పత్తిదారుడు పేటంట్ రైట్ కోల్పోవటంతో ఇతరులు వీటిని తయారుచేస్తారు. దీర్ఘకాలిక రోగాలకు ‘జనరిక్‌’ ఔషధాలు చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ ఖరీదైన మందులకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరే అయినా, ప్రజలు జనరిక్‌ మందుల వైపు వెళ్లడం లేదు. వైద్యులు కూడా ‘జనరిక్‌’ మందులను సిఫార్సు చేయడం లేదు. ప్రజల మంద మనస్తత్వమే దీనికి ఒక కారణం. తక్కువ ధర మందులు వాడటం వల్ల ఇతర సమస్యలు ఎక్కడ వస్తాయన్న భయంతో ప్రజలు జనరిక్ మెడిసిన్ అంటే మొఖం చాటేస్తున్నారు.

బయట మార్కెట్ 20రూపాయలకు దొరికే టాబ్లెట్ జనరిక్ మెడిసిన్ 8 రూపాయలకే ఇస్తుంది. ఇంత తక్కువ ధరకు లభించటంతో ప్రజల్లో అపోహ మొదలైంది. 2003లో ప్రధాని ఇకపై వైద్యులంతా జనరిక్ మెడిసిన్ మాత్రమే రాయాలని చెప్పినా అంతగా ‌ఎవరూ పాటించలేదు. అయితే గణాంకాల ప్రకారం ఒకింత జనరిక్ మందుల వాడకం పెరిగింది. ఇంకా పెరగాలంటే వైద్యులు జనరిక్ మెడిసిన్‌లనే మందుల చీటీలో రాయాలి. ఒకే మెడిసిన్ ఒకే ధరకు లభించేలా చర్యలు జరగాలి. నాసిరకం మందులను నిరోధించాలని తెలంగాణా ఫార్మా కౌన్సిల్ సభ్యులు ఆకుల సంజయ్ రెడ్డి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news