పచ్చి పాలు.. వేడి పాలు.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మేలు..!

పాలలో ఆరోగ్యానికి మంచి చేసే గుణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది పచ్చిపాలంటే ఇష్టపడతారు.ఇంకొంతమంది కాచిన పాలు ఇష్టపడుతుంటారు.అయితే ఆరోగ్యానికి ఏవి మేలు కలిగిస్తాయి. ఆరోగ్య నిపుణులు ఏవి మంచివనీ నిర్దారిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మానవుడి ఆరోగ్యం కోసం పాలు, కోడిగుడ్లు మంచి ఆహారంగా వైద్యనిపుణులు సూచిస్తుంటారు.పాలను సంపూర్ణపోషకాలు గల ఆహారం అని పరిగణిస్తారు.పాలలో దాదాపు శరీరానికి ఉపయోగపడే అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అందుకే మంచి ఆరోగ్యం కోసం పాలు తాగమని ఆరోగ్యానిపుణులు సూచిస్తుంటారు. అయితే కొంతమంది పచ్చిపాలను తాగుతుంటారు. ఇంకొంతమంది వేడి చేసుకొని తాగుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచిదనే విషయం గురించి తెలుసుకుందాం..

పాలు ఆరోగ్యానికి చాలా మంచివే. కానీ కొంతమంది కి పచ్చి పాలు తాగడం మంచిదా లేదా కాచిన పాలు తాగాలా అనే అనుమానాలు వస్తుంటాయి. సాధారణంగా పచ్చి పాలు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదనే వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆరోగ్య శాఖకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అందించిన వివరాల ప్రకారం పచ్చిపాలలో హాని కల్గించే బ్యాక్టీరియా ఉంటుంది. అంటే ఈకోలి, లిస్టేరియా, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా పచ్చిపాలలో ఉండే అవకాశాలున్నాయి. అందుకే పచ్చి పాలు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.

పచ్చి పాలు తీసుకోవడం వల్ల అందులో ఉండే లాక్టిక్ బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి కీడు కల్గిస్తుంది. ఫలితంగా వీరేచనలు,శరీరంలో నీటి శాతము తగ్గటం వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. శరీరంలో యాసిడ్ స్థాయి కూడా పెరుగుతుంది. అంతే కాక పాలు తీసేటప్పుడు ఆ జంతువుల పొదుగు కలుషితమై ఉంటుంది. అంతేకాకుండా..పాలు తీసే వ్యక్తుల చేతులు లేదా పరిసరాలు లేదా గిన్నె కూడా కలుషితమై ఉండవచ్చు. ఆ పాలు నేరుగా పచ్చిగా తాగితే ఆ కలుషితమంతా మీ శరీరంలో చేరుతుంది. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అందుకే పాలను బాగా ఉడికించి చల్లారిన తరువాత తాగడం వల్ల ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది.