నిద్రలో మాట్లాడటం సీరియస్‌ సమస్యా..? దీనికి కారణాలు ఏంటి..?

-

మనిషికి నిద్రపోవడం చాలా ముఖ్యం. కంటినిండా నిద్రపోతేనే.. బాడీ యాక్టివ్‌ అవుతుంది. కానీ నిద్రలో చాలా మందికి రకరకాల సమస్యలు ఉంటాయి. కొందరు గురక తీస్తారు, నిద్రలో నడుస్తారు, మరికొందరు నిద్రలో ఏదేదో మాట్లాడతారు. నిద్రలో మాట్లాడటాన్ని డ్రీమ్ డిజార్డర్, పైరాసోమ్నియా అని కూడా పిలుస్తారు. చాలామంది ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని అతి కొద్దిమందికే తెలుసు. మీ కూడా ఈ సమస్య ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యుడిని కలవండి..

ఆధునిక జీవన విధానంలో నిద్రకు సంబంధించి చాలా సమస్యలు ఎదురతున్నాయి. ఇందులో ఇన్‌సోమ్నియా, స్లీప్ యాప్నియా చాలా సాధారణం. ఇంకొంతమందిలో పైరాసోమ్నియా ఉంటుంది. పైరాసోమ్నియా అనేది ఒక స్లీప్ డిజార్టర్. దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఈ సమస్య ఎక్కువగా పిల్లల్లో చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో నిద్రలో మాట్లాడే వ్యాధి పెద్దల్లో కూడా ఉంటుంది. ఈ సమస్య ఉంటే ఆ వ్యక్తులకు నిద్ర భంగం కలగడమే కాకుండా ఇతరుల నిద్రకు కూడా ఆటంకం ఏర్పడుతుంది.

నిద్రలో మాట్లాడే సమస్యకు కారణాలు

జ్వరం లేదా వ్యాధి గ్రస్థులైనప్పుడు మనిషి బలహీనమై ఏదేదో మాట్లాడుతుంటారు. అలసటకు నిద్రకు మధ్య కచ్చితంగా సంబంధముంటుంది. ఎక్కువగా అలసినప్పుడు శారీరక పటుత్వం లేకపోతే నిద్రలో మార్పు వస్తుంది. అలసటగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పడుకునే విధానం కూడా మారిపోతుంది. నిద్రించాల్సిన అవసరముంటుంది కానీ నిద్ర త్వరగా పట్టదు. ఇలాంటి పరిస్థితుల్లోనే నిద్రలో మాట్లాడే సమస్య ఉత్పన్నమౌతుంది. అంటే సరిపడిన నిద్రలేక అలసినప్పుడు ఈ పరిస్తితి రావచ్చు.

డిప్రెషన్‌కు నిద్రకు మధ్య సంబంధం ఉందంటున్నారు. డిప్రెషన్ అనేది ఓ మానసిక స్థితి. ఇందులో వ్యక్తి మనోబలంలో లోటు, ఉదాసినత, నిద్రలో మార్పు ఉంటాయి. డిప్రెషన్ కొనసాగితే ఆ వ్యక్తి నిద్రపై పూర్తిగా ప్రభావం పడవచ్చు. ఆ వ్యక్తి కలలపై ప్రభావం పడుతుంది. సహజంగానే ఈ పరిస్థితి నిద్రలో మాట్లాడేలా చేస్తుంది. డిప్రెషన్ ఇతర మానసిక సమస్యలు శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. దాంతో నిద్ర సరిగ్గా పట్టక అవస్థలు పడుతుంటారు. రోజంతా అలసినప్పుడు డిప్రెషన్ కలలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దాంతో నిద్రలో మాట్లాడటం మొదలు పెడతారు. మనిషికి రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. ఇది తగ్గినా కూడా ఇదే సమస్య రావచ్చు.

ప్రతి రోజూ తగినంత అంటే 7-8 గంటలు రాత్రి నిద్ర కచ్చితంగా ఉండాలి. నిద్ర లోటు లేకుండా చేస్తే సహజంగా ఈ సమస్య తగ్గిపోవచ్చు. నిద్రపోయే ముందు ఎప్పుడూ మంచి విషయాలు, పాజిటివ్ ఆలోచనలు చేస్తే మంచిది. ఒత్తిడి తగ్గించుకునే పద్ధతులు అవలంభించాలి. యోగా , మెడికేషన్ సహాయంతో మానసిక ప్రశాంతత చేకూరేందుకు ప్రయత్నించాలి. ఇలా చేస్తే నిద్రలో మాట్లాడే సమస్య తగ్గిపోతుంది. నిద్రలో మాట్లాడే స్థితి చాలావరకూ దానంతటదే తగ్గిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇది మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news