వేసవిలో అందరు వడదెబ్బ నుండి తట్టుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా మే నెల రెండు, మూడు వారాల్లో భానుడి భగ, భగలు ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బయటికి వెళ్ళే ప్రయత్నాలు మానేసి లేదా పనులన్నీ వాయిదా వేసుకొని ఇంటి పట్టునే కూర్చుని ఉండలేము కదా. నీళ్ళు బాగా తాగి వెళితే వడదెబ్బ ని నివారించడం సాధ్యపడుతుంది. కాని ఎండకి చర్మం రంగు మారుతుంది. ఇంకా చర్మం ఎర్రగా మండుతుంది. వీటన్నిటి నుండి చర్మాన్ని రక్షించటానికి చిన్న చిన్న చిట్కాలు.
ఎండ దెబ్బకి చర్మ సమస్యలు మాత్రమే కాక తలనొప్పి, అతి దాహం, గొంతు ఆరి పోయినట్టు ఉండటం, వాంతులు, మూర్ఛ, అలసట, స్కిన్ క్యాన్సర్ వంటివి కూడా సంభవిస్తాయి. ఇంకొక విషయం ఏమిటంటే తెల్లగా, ఎర్రగా ఉండే వారిలో ఈ అవకాశాలు ఎక్కువ. చర్మ సమస్యల వల్ల ముఖం మీద దురదలు, చర్మం ఊడుతున్నట్టు ఉండటం, మంట, నొప్పి ఇంకా చాలానే ఉన్నాయి. ఇది ఎండ వల్ల వస్తుంది అనుకోవటం పొరపాటు. సూర్యుడి నుండి వెలువడే అల్ట్రా వాయిలేట్ రేస్ కిరణాలు చర్మానికి బద్ద శత్రువులు.
ఈ కిరణాల వలనే చర్మం రంగులో మార్పులు, మంట, మొటిమలు, పొక్కులు ఇలా అన్ని వీటి వల్లే వస్తాయి. వీటి నుండి ఉపశమనం పొందటానికి సన్ స్కీన్ లోషన్ వాడటం అలవాటు. చేసుకోవాలి. ముఖానికి మాస్క్ వాడటం, నెత్తికి టోపీ వాడటం లాంటివి చేయాలి. చర్మం మంటకు ఐస్ క్యూబ్ లను తీసుకువచ్చి రుద్దడం చేయవద్దు. చన్నీటి స్నానం చేయండి. ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండండి. మంచి నీటితో పాటు కొబ్బరి నీళ్ళు ఉండాలి. విటమిన్ సి ఉన్న పండ్లను తీసుకోవాలి. విటమిన్ సి సెరం తో రోజు చర్మానికి మర్దన చేయాలి. మళ్ళి మీ రంగు మీకు వచ్చే మార్గం ఇదే.