ఇలా చేస్తే కచ్చితంగా సిగరెట్ మానేస్తారు మాస్టారు…!

-

ధూమపానం అలవాటు మానడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ డబ్బులను కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. దీని కోసం ఈ సిగరెట్ అది ఇది అని డబ్బులు వృధా చేసుకుంటూ ఉంటారు జనం. అలవాటు అయిపోయిన వాళ్ళు ఎందరో దీని బారిన పడి ఆరోగ్యం నాశనం చేసుకుంటూ ఉంటారు. దీని మీద ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు.

అయినా సరే ఫలితం మాత్రం ఉండదు. ఈ ప్రశ్న శాస్త్ర వేత్తలను కూడా ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. అయితే పొగ తాగే అలవాటు మానాలి అంటే, ఇప్పటికే మార్కెట్లో రకరకాల మందులు, ట్రీట్‌మెంట్లు అందుబాటులోకి వచ్చినా, వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటంతో ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, దీనితో టెక్సాస్‌ టెక్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీనిపై కొన్ని ప్రయోగాలు చేసారు.

ఈ పరిశోధనలలో ధ్యానం వల్ల కొంత ఉపయోగం ఉంటుందని వారు గుర్తించారు. ఒక వ్యక్తి తనను తాను ఎంత వరకూ నియంత్రించుకోగలడనే విషయాన్ని కనుగొనటానికి శాస్త్రవేత్తలు కొన్ని అధ్యయనాలు చేయగా… సిగరెట్ తాగాలనే ఆలోచన కలిగినప్పుడు మెదడులో కొన్ని భాగాలలో స్పందన కలుగుతుందని, క్రమం తప్పకుండా ధ్యానం చేసే వారిలో ఈ స్పందనలు చాలా నెమ్మదిగా ఉంటాయని, ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news