రేగుపళ్ళతో ఇన్ని లాభాలా..?

-

పిల్లలకు భోగి పండుగ రోజున భోగి పండుగ రేగు పండ్లను పోస్తూ ఉంటారు.ఎందుకంటే రేగి పండ్లు పిల్లల మానసిక రుగ్మతలను తగ్గిస్తుందని నమ్మకం. ఆయుర్వేదం కూడా దీనిని రుజువు చేసింది. సి విటమిన్లను సమృద్ధిగా కలిగి ఉండే రేగుపండును అనేక రుగ్మతల నివారణలో ఆయుర్వేదంలో వాడుతున్నారు. రేగిపండ్లతో పాటు బెరడు, ఆకులు, గింజలు…ఇలా రేగు చెట్టే ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. రేగుపండులో అధిక మొత్తంలో ఐరన్ మరియు ఫాస్ఫరస్ లభిస్తుంది. ఇది రక్తంలోని ఎర్రరక్తకణాల వృద్ధికి దోహదపడుతుంది. అందువల్ల ఐరన్ మరియు రక్తహీనత సమస్యతో బాధపడేవారు కండరాలు మరియు అజీర్తి సమస్యలతో బాధపడేవారు రేగుపండును తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

రేగుపండులో అనేక పోషకాలతో పాటు ఫాస్ఫరస్ మరియు ఐరన్ ఎముకలను బలోపేతం చేస్తుంది. వయసు పైబడటం వలన కొందరిలో ఎముకలు పెలుసుగా మరియు బలహీనంగా మారే ప్రమాదం ఉంది. అలాంటి వారు రేగుపండ్లను తీసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఎదుగుతున్న పిల్లలకు రేగు పండు తినిపిస్తే అది పారి శారీరక మరియు మానసిక ఎదుగుదలకు మంచిది.

అధిక బరువు సమస్యతో బాధపడేవారు రేగు పండ్లు తీసుకోవడం ఒక చప్పదగ్గ సలహా. రేగు పండ్లు తక్కువ మొత్తంలో క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ప్రోటీన్స్,ఫైబర్ ను కలిగి ఉంది. అందువల్ల తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం చేసి జీర్ణక్రియ వ్యర్ధాలను బయటకు తేలికగా విసర్జించడంతోపాటు శరీరానికి అనే పోషకాలను అందిస్తుంది.రేగుపండు యాంటీ ఆక్సిడెంట్లను మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంది. రేగుపండు వృద్ధాప్య చాయలను దరిచేరనివ్వదు. శరీరానికి అనేక చర్మపు ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. వయస్సు పైబడటం వల్ల చర్మంపై ఏర్పడే ముడతలు, ముసలితనపు లక్షణాలను తగ్గించి, చర్మాన్ని యవ్వనంగా మరియు కాంతివంతంగా మారుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news