నువ్వులు వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా…?

Join Our Community
follow manalokam on social media

సాధారణంగా నువ్వులని వంటల్లో, పిండి వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. వాటిని కనుక తింటే ఎంతో బలం వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నిజంగా వీటి వలన అంత ప్రయోజనం ఉందా…? అంత ఇంత కాదండి చాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే వాటి కోసం తెలుసుకోండి. నువ్వుల తో చేసిన వంటలు శరీరానికి చాలా బలాన్నిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరానికి చాల మేలు చేస్తాయి. నువ్వుల్లో ఇనుము శాతం అధికంగా ఉంటుంది. కనుక దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.

అలానే తరచూ నీరసం కలిగే వాళ్ళు కూడా దీనిని తీసుకుంటే చాల మంచి కలుగుతుంది. అలాంటి వాళ్ళు నువ్వులు, బెల్లం కలిపి ఉండలు చేసుకుని తింటే మంచిది. నువ్వుల్లోనూ, బెల్లంలోనూ కూడా ఇనుము ఎక్కువగానే ఉంటుంది. అలానే హైబీపీతో బాధపడే వారు నువ్వుల నూనె తో చేసిన వంటకాలు తినాలి. ఇలా చేస్తే అధిక రక్తపోటును అదుపు లో ఉంచడానికి వీలవుతుంది.

నువ్వుల్లో అమినోయాసిడ్ లు, మాంస కృత్తులు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదండి నువ్వులు రక్తం sలోని చక్కెర స్థాయిలను కూడా అదుపు చేస్తాయి. దీని వల్ల ఉబ్బసం వ్యాధి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు సక్రమంగా పనిచేసేలా ఇది సహాయ పడతాయి. వీటిలో ఉండే సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె వ్యాధుల నుంచి కాపాడుతుంది. చూసారా ఎన్ని ప్రయోజనాలో…! మరి నువ్వులని ఉపయోగించండి. ఈ సమస్యల నుండి బయట పడండి.

 

 

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...