గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బరిలో బీజేపీ..ప్యూహం అదేనా

-

గ్రేటర్ లో బీజేపీ కి మేయర్ గెలిచే సంఖ్య బలం లేదు… అయిన మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకి పోటీ చేయాలని నిర్ణయించింది.. బీజేపీ ఎందుకు పోటీ చేయాలని అనుకుంటుంది.. బీజేపీ వ్యూహాం ఏంటి.తమకు మెజారిటి లేనందున మేయర్ స్థానానికి పోటిపడమన్న కమలదళం అనూహ్యంగా పోటికి సిద్దమైంది. దీంతో మేయర్ ఎన్నికలో ఏం జరుగుతుందన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.

రేపు జీహెచ్‌ఎంసీ నూతన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు.కొత్త పాలకవర్గం కొలువు తీరనుంది.అయితే మేయర్ ఎవరు అవుతారనే చర్చ జరుగుతోంది. ఈక్రమంలో బీజేపీ స్టాండ్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్‌లో బలాబలాల విషయానికి వస్తే అధికార టీఆర్‌ఎస్‌ మేయర్, డిప్యూటీ మేయర్లను కైవసం చేసుకునే సంఖ్య బలం ఉంది. ఇక బీజేపీ ఎక్స్ ఆఫీషియో సభ్యులను కలిపితే మూడో స్థానంలో ఉంది.బీజేపీకి గ్రేటర్ లో 47 మంది కార్పొరేటర్ లు , ఇద్దరు ఎక్స్ ఆఫీషియో సభ్యులు కలిపి 49 మంది ఉన్నారు.

ఇక గ్రేటర్ మేయర్ ,డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్ద అనే అంశం పై బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.ఈ విషయం పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని గ్రేటర్ బీజేపీ నేతలకు చెప్పారు… సమావేశం అయిన గ్రేటర్ నేతలు మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నికలో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు చేరవేశారు.

పార్టీకి గెలిచే బలం లేకున్నా టీఆర్‌ఎస్‌ని ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఇవ్వొద్దని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. బీజేపీ పోటీ చేస్తే టీఆర్‌ఎస్‌పై ఎంఐఎం వైఖరి ఏంటో తెలిస్తుంది అనే అభిప్రాయం తో బీజేపీ నేతలు ఉన్నారు..తాము పోటీ చేయక పోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. దీంతో పోటీ చేయాలని బిజెపీ నేతలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే గ్రేటర్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది బీజేపీ. మేయర్,డిప్యూటీ మేయర్ స్థానాలకి అభ్యర్థులను పెట్టాలని ఆ పార్టీ నేతలు డిసైడ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news