కడుపులో మంట, ఉబ్బరం నిమిషాల్లో తగ్గే చిట్కాలు?

-

చాలా మంది కూడా కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలతో తీవ్రంగా సతమతమవుతుంటారు. మనం తీసుకునే స్పైసి ఫుడ్స్ వల్లే ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల అసిడిటీ సమస్య వస్తుంది. అలాగే వేడి వేడి టీ, కాఫీ ఎక్కువగా తాగినా, వీటిని ఖాళీ కడుపుతో ఎక్కువగా తాగినా కూడా అసిడిటీ సమస్య వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పే కొన్ని ఇంటి చిట్కాలు నిమిషాల్లో ఉపశమనం కలిగిస్తాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కొత్తిమీర ఆకులను తీసుకొని వాటిని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగితే కడుపులో మంట నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.ఎందుకంటే కొత్తిమీర జీర్ణ సమస్యలకు బాగా పనిచేస్తుంది. ఇది అజీర్తి, గ్యాస్‌, కడుపు ఉబ్బరం ఇంకా అసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అందువల్ల మీరు ఈ సమస్యకు కొత్తిమీర నీళ్లను తాగవచ్చు.కడుపులో మంట లేదా పొట్ట ఉబ్బరం సమస్యలు ఎక్కువగా ఉన్నవారు 4 లేదా 5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో కడుపు చల్లగా అవుతుంది. అప్పుడు రీఫ్రెష్ అయినట్లు ఫీలవుతారు.

ఇంకా అలాగే జీర్ణ సమస్యల నుంచి కూడా ఈజీగా ఉపశమనం లభిస్తుంది. అలాగే సోంపు గింజలతో తయారు చేసిన డికాషన్‌ను తాగడం వల్ల కూడా కడుపులో మంట, ఉబ్బరం నుంచి ఈజీగా బయట పడవచ్చు. సోంపు గింజలను తీసుకొని నీళ్లలో వేసి మరిగించి నీరు రంగు మారగానే వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ నీళ్లను రాత్రి తాగితే నిద్ర ప్రశాంతంగా పడుతుంది. జీలకర్ర నీళ్లను తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ నుంచి నిమిషాల్లో ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే మన జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది. జీలకర్ర నీళ్లను తాగడం వల్ల అధిక బరువు కూడా సింపుల్ గా తగ్గుతారు. ఇందుకు గాను ఒకపాత్రలో నీళ్లను తీసుకుని అందులో జీలకర్ర ఒక టీస్పూన్ వేసి కొంచెం సేపు మరిగించాలి. ఆ నీళ్లు రంగు మారే దాకా మరిగించిన తరువాత నీళ్లను వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే వాటిని తాగేయాలి. దీంతో కడుపులో మంట నుంచి చాలా ఈజీగా ఉపశమనం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news