మీ ధ్యాస పని వైపు వెళ్లడం లేదా..? అయితే ఇలా చేయండి..!

Join Our Community
follow manalokam on social media

సాధారణంగా మనకి రోజులో చాలా పనులు ఉంటాయి. ఒక్కొక్కసారి వాటి మీద మనం దృష్టి పెట్టలేక పోతాము. అనుకున్న పనులు కూడా పూర్తి చేయలేక పోతాము. అయితే మీరు మీ పనులు వాయిదా వేయకుండా సరిగ్గా సమయానికి పూర్తి చేయాలనుకుంటున్నారా….? మీ రోజుని వృధా చేయకుండా సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి అనుకుంటున్నారా…?

 

అయితే ప్రతి రోజు లేవగానే తప్పకుండా వీటిని అనుసరించండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులు మీరు పూర్తి చేయగలరు. పైగా ఎటువంటి బద్ధకం లేకుండా సరిగ్గా సమయానికి మీ టాస్క్లన్నిటిని పూర్తి చేయడానికి వీలవుతుంది.

వ్యాయామం చేయండి :

వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల సరిగ్గా ఆ సమయానికి మీ పనులు మీరు పూర్తి చేయడానికి కూడా వీలవుతుంది. యోగ, మెడిటేషన్ మీ బాడీ, మైండ్ కి ట్రై ఇస్తుంది. ప్రతి రోజూ సమయ పాలన పాటించి యోగ, మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. అలానే ప్రశాంతంగా ఉండి మీ పనులు మీరు సమయానికి పూర్తి చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

హైడ్రేట్ గా ఉండండి:

ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని తీసుకోవడం వంటివి చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీరు డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటారు. అలానే ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండండి. దీని వల్ల కూడా మీరు డీహైడ్రేషన్ కు గురి అవకుండా ఉండొచ్చు. పైగా మీ పనులు కూడా పూర్తి చేయడానికి మీరు యాక్టివ్ గా ఉంటారు.

స్ట్రెచ్ చేయండి:

కొద్దిగా స్ట్రెచ్ చేయడం వల్ల టెన్షన్ తగ్గుతుంది. అలానే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా కనుక మీరు పాటించారు అంటే తప్పకుండా మీరు అనుకున్న పనులు సమయానికి చేయడానికి వీలవుతుంది. రోజంతా కూడా ఎంతో ప్రశాంతంగా, రిలీఫ్ గా ఉండొచ్చు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...