డయాబెటిస్ తో బాధపడుతున్నారా..? రంజాన్ మాసంలో ఉపవాసం చేస్తుంటే వీటిని మర్చిపోవద్దు..!

-

రంజాన్ మాసం లో చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. నెలంతా కూడా ముస్లింలు ఉపవాసం చేస్తూ ఉంటారు. నిజానికి ఉపవాసం చేయడం వల్ల డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. డయాబెటిస్ వాళ్లు ఎక్కువ సేపు ఏమి తీసుకోకుండా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది.

 

14 నుండి 15 గంటలపాటు ఆహారం తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకనే డయాబెటిస్ తో బాధపడే వాళ్లు రంజాన్ మాసం లో ఉపవాసం చేస్తుంటే ఇవి పాటించండి. ఈ టిప్స్ ని కనుక ఫాలో అయ్యారు అంటే ఉపవాసం చేసే సమయంలో ఇబ్బందులు కలగవు.

డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఎక్కువ సేపు ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి. ఈ కారణంగా హైపోగ్లైసీమియా అనే సమస్య వస్తుంది. నీరసం కలగడం కళ్లు తిరిగి పడిపోవడం ఇలాంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది.
ఒకవేళ షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి అంటే వీక్నెస్, నీరసం, కళ్ళు బ్లర్ గా కనిపించడం లాంటి ఇబ్బందులు వస్తాయి.

ఎక్కువ సేపు ఆహారం తీసుకోకపోవడం వల్ల బీపి కూడా పెరుగుతుంది. నిజానికి బీపీ రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. బీపీ లెవెల్స్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి అలానే ఒత్తిడి లేకుండా ఉండాలి.

అయితే గ్లూకోజ్ లెవల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఆరోగ్య నిపుణులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. వాటి కోసం కూడా చూద్దాం. ఉపవాసం చేసే సమయంలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అటువంటప్పుడు పండ్లు, కూరగాయలు, పెరుగు వంటివి తీసుకోవాలి అని చెప్పారు. అలానే నీళ్లు కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. డీహైడ్రేషన్ కి గురి కాకుండా చూసుకోవాలి. అదే విధంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయటకు వెళ్లకుండా ఇంటి పట్టె ఉండటం మంచిది. ఇలా డయాబెటిస్ వాళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు కలగవు.

Read more RELATED
Recommended to you

Latest news