మెదడు ఆరోగ్యం బాగుండాలంటే వీటిని తీసుకోండి..!

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మన మెదడు ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం మొదలైన పనులు మెదడు ద్వారా చేస్తాం. కనుక మెదడు కూడా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.

 

అయితే మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం. వీటిని కనుక తీసుకుంటే మెదడు ఆరోగ్యం చాలా బాగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసమే పూర్తిగా చూద్దాం.

విటమిన్ ఈ :

విటమిన్ ఈ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఈ పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు. ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జ్ఞాపక శక్తిని కూడా పెంపొందిస్తుంది. కనుక విటమిన్ ఈ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. డైట్ లో వీటిని ఉండేటట్టు చూసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఇంఫ్లమేషన్ తగ్గుతుంది. అలానే మతిమరుపు సమస్య కూడా ఉండదు.

విటమిన్ బి:

విటమిన్ బి కూడా మెదడు ఆరోగ్యానికి ముఖ్యం. ఇది జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. అలానే డిప్రెషన్, మైగ్రేన్ వంటి సమస్యలు తగ్గిస్తుంది.

జింక్:

జింక్ జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. అలానే రోగనిరోధక శక్తి కూడా పెంపొందిస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది మెదడు ఆరోగ్యానికి కూడా ఇది చాలా ముఖ్యం. కాబట్టి వీటన్నిటినీ కూడా తప్పకుండా ఉండేటట్లు తీసుకోండి. దీంతో మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.