తేనే, మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలు తగ్గిపోతాయి..!

-

తేనె, మిరియాలు రెండు ఆరోగ్యానికి చాలా మంచివి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలానే మిరియాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అయితే మరి అలా వాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం.

Honey,-pepper
Honey,-pepper

జలుబు తగ్గుతుంది:

జలుబు తగ్గడానికి రాత్రిపూట ఒక టీ స్పూన్ తేనెలో అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని తీసుకుంటే జలుబు తగ్గుతుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల సమస్యల బారిన పడకుండా ఉంటాము. రోగ నిరోధక శక్తి పెరగాలంటే నీళ్లలో మిరియాల పొడి వేసుకుని తీసుకోండి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అజీర్తి సమస్యలు ఉండవు:

అజీర్తి సమస్యలను తొలగించడానికి నల్ల మిరియాలు బాగా ఉపయోగ పడతాయి. నల్ల మిరియాల తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ, కాన్స్టిట్యూషన్ వంటి సమస్యలు ఉండవు.

కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి:

నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అలానే గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. నీళ్లల్లో నల్ల మిరియాలు వేసి మరిగించి గ్లాస్ లో వేసుకుని ఆ తర్వాత అందులో కొద్దిగా తేనె వేసుకొని తీసుకోండి. ఇలా కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. అలానే ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు తొలగించడానికి కూడా తేనే, మిరియాలు ఉపయోగపడతాయి. ఇలా ఇన్ని లాభాలని ఈ రెండింటితో పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news