పొట్లకాయ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని ఎండాకాలం అధికంగా తింటారు. ఎందుకంటే శరీరాన్ని చల్లగా ఉంచే గుణం దీనికి ఉంటుంది. అంతేకాదు దీనివల్ల ఉదర సంబంధిత వ్యా«ధులు కూడా తగ్గుముఖం పడతాయంటారు. ఇందులో ఉండే పోటాషియం, జింక్ బీపీని అదుపులో ఉంచుతుంది. పొట్లకాయను షుగర్ పేషెంట్లు తినడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండచ్చు.
- పొడవు పెరుగుతామనే అపోహతో చాలా మంది పొట్లకాయ రసాన్ని ఎక్కువగా తాగుతుంటారు. కానీ, అది శరీరానికి హానికరం.
- ఇలా పొట్లకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది. వాంతులు వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు రసం తయారీకి తగిన శుభ్రత పాటించకపోతే.. బ్యాక్టీరియా సంక్రమిస్తుంది.
- కొంతమంది ఈ రసం తీసుకోవడం వల్ల వారి శరీర భాగాలకు వాపు వస్తుంది. దీంతో పాటు దురద వంటి సమస్యలు కూడా రావచ్చు.
- పొట్లకాయ రసం తినే వారు రసం అస్సలు చేదుగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. దీని చేదు కడుపులో గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, దానిని తొలగించడానికి, మీరు రసంలో నల్ల ఉప్పు, నల్ల మిరియాలు పొడి, పుదీనా ఆకులు వేసి తాగవచ్చు.
- ఈ పొట్లకాయ రసాన్ని పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగాలి. అలాగే, ఒక రోజులో ఒక గ్లాసు కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఏదైనా అతి అనార్థాలకు దారితీస్తుంది.