టీ తో పాటు వీటిని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది…!

-

చాలా మంది ఇళ్లల్లో టీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. కనీసం రోజుకి రెండు నుండి మూడు సార్లు కూడా తాగుతూ ఉంటారు. అయితే టీ తాగేటప్పుడు చలికాలంలో వీటిని తీసుకుంటే ఖచ్చితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే టీ తో పాటు వీటిని తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

 

దీనితో మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే మరి అవి ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీనికోసమే పూర్తిగా చూసేయండి. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

మీరు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అని చూస్తున్నారా అయితే ప్రతిరోజు మీరు తాగే టీ లో వీటిని యాడ్ చేసుకోండి దీనితో మీకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే ఇతర ప్రయోజనాలు కూడా మీరు పొందవచ్చు.

అల్లం:

టీ తో పాటు అల్లాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు చేసే టీ లో కొద్దిగా అల్లం ని దంచి మరిగించండి. ఇది రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అలానే దగ్గు, జలుబు వంటి వాటి నుండి కూడా మీరు రిలీఫ్ పొందొచ్చు.

తులసి:

తులసి లో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఆయుర్వేద మందులలో కూడా తులసిని విరివిగా వాడుతుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అలాగే బ్లడ్ షుగర్ కూడా మంచిగా ఉంటుంది. టీ చేసినప్పుడు తులసిని కూడా మీరు యాడ్ చేసుకోచ్చు.

మిరియాలు:

మిరియాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. మిరియాల టీని తాగితే జలుబు దగ్గు గొంతునొప్పి వంటి సమస్యల నుండి బయట పడవచ్చు.

యాలుకలు:

యాలకులను కూడా టీలో వేసుకుని తీసుకుంటే అద్భుతమైన లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఇది మంచిది. కాబట్టి మీరు రోజూ చేసుకునే టీ లో వీటిని తీసుకుంటే రోగనిరోధక శక్తి తో పాటు ఇన్ని లాభాలు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news