కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. చాలా మంది ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టి మంచిగా డబ్బుల్ని పొందుతున్నారు. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. చాలా మంది ఈ స్కీమ్ లో డబ్బులు పెడుతున్నారు.
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయస్సులోపు వున్నవాళ్లు చేరచ్చు. ఈ స్కీమ్ లో చేరిన వారు 60 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టాలి. తరవాత ప్రతి నెలా డబ్బులను పొందొచ్చు. ఇది ఇలా ఉంటే ఈ స్కీమ్ లో చేరాలంటే బ్యాంక్ లేదా పోస్టాఫీస్ కు వెళ్లి ఈజీగా చేరచ్చు. మీరు కట్టిన దాని బట్టీ పెన్షన్ వస్తుంది.
ఈ స్కీమ్ లో చేరిన వారు నెలకు 210 రూపాయల చొప్పున చెల్లిస్తే 5,000 రూపాయల చొప్పున 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ ను పొందవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ చెల్లించే మొత్తం పెరుగుతుంది కనుక చిన్న వయసులో వున్నప్పుడే చేరిపోవడం మంచిది.
సబ్‌స్క్రైబర్ మరణిస్తే భాగస్వామి పెన్షన్ ను పొందొచ్చు. భార్యాభర్తలిద్దరూ కలిసి కూడా ఈ స్కీమ్ లో చేరచ్చు. ఇద్దరు కలిపి నెలకు 700 రూపాయల చొప్పున చెల్లిసే పదవీ విరమణ తర్వాత నెలకు 10,000 రూపాయలు పొందొచ్చు.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల మంది ఈ స్కీమ్ లో చేరారు. కేవలం 22 రూపాయలు పొదుపు చేయడం ద్వారా సులభంగా ఈ మొత్తాన్ని పొందొచ్చు. దగ్గరలో పోస్టాఫీస్ లేదా బ్యాంకును సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోచ్చు.