డైట్ లో వీటిని తీసుకుంటే మూడ్ బాగుంటుంది..!

-

ఒక్కొక్కసారి మన యొక్క మూడ్ మారిపోతూ ఉంటుంది. కోపంగా, ఇబ్బందిగా, చికాకుగా అనిపిస్తుంది. అయితే అలా కాకుండా మంచి మూడ్ తో ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు మనకి సహాయపడతాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఏ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మూడ్ బాగుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

విటమిన్ సి:

విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంపొందిస్తుంది. మూడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ సి లోపం ఉన్న వాళ్ళలో నీరసం, డిప్రెషన్ వంటివి కలుగుతాయి. కాబట్టి సరిపడా విటమిన్-సి ఉండడం చాలా ముఖ్యం.

విటమిన్ డి:

విటమిన్ డి కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్-డి ను తీసుకోవడం వల్ల కూడా మూడ్ బాగుంటుంది. విటమిన్-డి ను తీసుకోవడం వల్ల డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

విటమిన్ బి6 :

విటమిన్ బి6 కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది కూడా మూడ్ ని మెరుగుపరుస్తుంది అలానే మంచి నిద్రను ఇస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది.

విటమిన్ బి9 :

విటమిన్ బి9 కూడా చాలా అవసరం. ఇది కూడా మూడ్ ని మెరుగుపరుస్తుంది కాబట్టి దీనిని తీసుకుంటూ ఉండండి. అదేవిధంగా విటమిన్ బీ12 కూడా మూడ్ ని మారుస్తుంది. మాంసం, గుడ్లు, చేపలు మొదలైన వాటి ద్వారా ఇది లభిస్తుంది. వీటిని కూడా తీసుకుని ప్రశాంతంగా ఉండండి. అలానే ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news