సెల్ఫీరాజా జరభద్రం..

-

ఫోన్‌ చూస్తే చాలు మొదట గుర్తొచ్చేది సెల్ఫీనే.. ఈ జెనరేషన్‌కు సెల్ఫీ వ్యసనంలా మారిపోయింది. ఏ పనిచేసినా సెల్ఫీ అంటూ ఫోజిలిచ్చేవారి సంఖ్య పెరిగిపోతుంది. కొందరైతే సెల్ఫీని చాలెంజ్‌గా తీసుకొని ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. ఈ పిచ్చిని ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది. లేకుంటే ఇలా తయారవుతారు.

సెల్ఫీ తీసుకోవచ్చు. సెల్ఫీనే పనిగా పెట్టుకుంటే మాత్రం కష్టం సుమా.. సెల్ఫీ ఎక్కువగా తీసుకునేవారిలో ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సెల్ఫీ కరెక్ట్‌గా రావాలని శరీరాన్ని, మోచేతులను అటూఇటూ తిప్పుతుంటారు. సెల్ఫీ తీసుకునేటప్పుడు మోచేతిపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి ఎక్కువైపోయి అనారోగ్య సమస్యగా మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేతితో సరిగా రావడం లేదని చాలామంది సెల్ఫీస్టిక్‌ వాడుతుంటారు. దీంతో ఫోన్‌ను దూరం నుంచి చూడవచ్చు. ఇది ఒకందుకు మంచిదైనా దీంతో కూడా ముప్పు వాటిల్లుతుంది.

టెన్నిస్‌, గోల్ఫ్‌ ఆడేవారికి మోచేతి సమస్యలు అధికంగా ఉంటాయి. దీని ప్రభావం ఎలా అయితే ఉంటుందో సెల్ఫీస్టిక్‌ వాడడం వల్ల కూడా అంతే ఎఫెక్ట్‌ ఉంటుంది. సెల్ఫీలు మరీ ఎక్కువగా తీసుకుంటుంటే కండరాల మీద ఒత్తిడి పడి మోచేతి ప్రాంతమంతా వాపుగా మారుతుంది. ఫోన్‌ను ఎక్కువగా వాడడం తగ్గించండి. అలాగే సెల్ఫీలకు దూరంగా ఉండండి. అంతగా ఫొటోలు అవసరం అనుకుంటే నార్మల్‌ ఫొటోలు తీసుకోండి. అంటే వేరేవారి చేత ఫొటోలు తీయించుకోండి. సెల్ఫీలను వీలైనంత త్వరగా దూరంగా ఉండంమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news