పచ్చి సోంపు గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. !!

-

భారతీయుల ఆహారపు అలవాట్లలో భోజనం తర్వాత తప్పనిసరిగా సోంపు గింజలు తీసుకోవటం అలవర్చుకున్నారు. అనాదిగా ఈ అలవాటు కంటిన్యూ అవుతూ వస్తోంది. మనం హోటల్‌లో తిన్న తర్వాత తప్పనిసరిగా సోంపు ఇస్తారు. దీంతో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా ఇది నోటి దుర్వాసన పోగొట్టడానికి కూడా పనిచేస్తుంది. ఇవే కాక సోంపు తినడం వల్ల ఇతర అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. నిత్యం భోజనం చేశాక సోంపు గింజలను తినడం అలవాటుగా చేసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఓసారి చూద్దాం.

సోంపు గింజల్లో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, మంచి పోషకాలు ఉంటాయి. ఈ గింజల్లో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఐరన్, సెలెలియం, ఫైబర్, మాంగనీస్, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక ఖనిజాలు విరివిగా ఉంటాయి. ఈ గింజలు సంవత్సరం మొత్తం దొరుకుతాయి. దీన్ని తినడానికి రెగ్యులర్ సమయం అంటూ లేదు.. రోజులో ఎప్పుడైనా తినవచ్చు.

జీర్ణక్రియ:
మనం హోటల్లో కానీ, ఫంక్షన్ లో కాని భోజనం తరువాత సోంపు ఇస్తుంటారు.ఇందులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ జీర్ణ వ్యవస్థను బల పరచి గ్యాస్ సంబంధిత రోగాలు రాకుండా చేస్తుంది.యాంటిస్పాస్మోడిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనెటోల్, ఫ్యాన్‌కాన్ వంటి గుణాలు కూడా ఉంటాయి.

క్యాన్సర్ నివారణ:
అన్నింటికీ కన్నా ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్. అలాంటి క్యాన్సర్ ని రాకుండా నివారించడానికి ప్రతిరోజూ ఒక స్ఫూన్ పచ్చి సోంపు తినడం అలవాటు చేసుకోవాలి. ఇందులో వుండే ప్రీ ర్యాడికల్స్ క్యాన్సర్ రాకుండా నిరోదిస్తుంది.

బరువు తగ్గడం:
సోంపు హెరిడీటీ సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి శరీరంలో వున్న అధిక కొవ్వులను కరిగించడానికి దోహదం చేస్తుంది. బరువు తగ్గాలనుకొనే వారు ఉదయం పరగడుపునే సోంపు వేసిన టీ త్రాగితే తొందరగా బరువు తగ్గుతారు.

రక్తపోటు నియంత్రణ:
సోంపు గింజలను తినడం వల్ల మన నోట్లో వూరే లాలాజలములో నైట్రైట్ శాతం పెరిగి,బ్లడ్ ప్రెజర్ని కంట్రోలో ఉంచుతుంది.సోంపు గింజల్లో పొటాషియం కూడా అధికంగా ఉండడం వల్ల శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news