కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా విస్తరిస్తుంది. ఊహించని విధంగా చాప కింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తుంది. ఇప్పటి వరకు ఏపీ లో 14 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటిల్లో ఎవరికి ప్రాణాపాయం లేదు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా వైరస్ సోకింది అనే వార్తలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరించడం తో ఏపీ ప్రభుత్వం సతమవుతుంది.
ఇటీవల సదరు ఎమ్మెల్యే గారి బంధువులు ఒక పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో కరోనా సోకినా వ్యక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బంధువుకి కరోనా వైరస్ సోకింది. ఆయన సొంత చెల్లికి కూడా కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కుటుంబం మొత్తం క్వారంటైన్ లో ఉంది. ఆ పార్టీకి మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లినట్టు తెలుస్తుంది. వారు అందరికి కరోనా పరిక్షలు చేస్తున్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో ఏపీ లో ప్రజలు ఎవరూ కూడా బయటపడటం లేదు. పోలీసులు కూడా అత్యంత కఠినం గా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఎవరిని కూడా బయటకు రానీయడం లేదు. ప్రతీ చిన్న విషయానికి బయటకు వస్తుండటం తో ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తుంది. ప్రస్తుతం ఏపీ లో కరోనా కట్టడి లోనే ఉంది.