రోజ్ టీ తో ఈ సమస్యలు దూరం…!

-

గులాబీ కేవలం సౌందర్య ప్రయోజనాలకు మాత్రమే అనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గులాబీ తో టీ చేసుకుని తాగితే చాలా సమస్యల్ని మనం సులువుగా తరిమికొట్టొచ్చు. ఎర్ర గులాబీ పూలని కొనుగోలు చేసి… ఆ రేకులు తీసుకుని టీ ని తయారు చేయొచ్చు.

rose tea
rose tea

దీని కోసం ముందుగా మీరు కొన్ని గులాబీ రేకులను తీసుకుని వేడి నీటిలో మరగబెట్టి, ఇప్పుడు ఆ నీటిని వడకట్టి ఉంచండి. ఈ మిశ్రమంలో కొద్దిగా తీయదనాన్ని జోడించవచ్చు. మీకు ఏమైనా ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలంటే అల్లం, యాలకులు, లవంగాలు వంటివి ఏమైనా వేసుకోవచ్చు. తేనె కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

ఇన్ఫ్లమేషన్ సమస్యతో పోరాడుతుంది:

గులాబీ పూల లో అనామ్లజనకాలు ఉండడం వలన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. దీనితో ఇన్ఫ్లమేషన్ సమస్య తొలగుతుంది.

ఆకలి కోరికను తగ్గిస్తుంది :

చాలా మంది బరువు తగ్గాలని అనుకుంటారు. వాళ్లు కనుక ఈ టీ ని చేసుకుని తాగితే ఆకలి కోరికలు తగ్గుతాయి. దీంతో బరువు కూడా తగ్గవచ్చు.

రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

గులాబీ టీ తాగడం వల్ల అనారోగ్యాలు లేకుండా చూసుకోవడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంపొందిస్తుంది.

విషాన్ని తొలగిస్తుంది :

శరీరంలో ఏదైనా విష పదార్థాలు ఉంటే వాటిని కూడా రోజ్ టీ తొలగిస్తుంది.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పెంచుతుంది:

ఈ టీ తాగడం వల్ల జీర్ణ క్రియను పెంచడానికి ఇది సహాయం చేస్తుంది మరియు ఒక ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను ఇది రూపొందిస్తుంది. అలానే మలబద్ధకం అతిసారం వంటి సమస్యలని కూడా ఇది చిటికెలో తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news