మెదడు బాగా పని చెయ్యాలంటే వీటిని డైట్ లో తీసుకోవాలి..!

-

మనకి ఉండే ముఖ్యమైన భాగాలలో మెదడు కూడా ఒకటి. మనం సక్రమంగా ఆలోచించాలి అంటే మెదడు పని తీరు బాగుండాలి. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మన మెదడు యొక్క పని తీరుని మార్చుకోవచ్చు. అలానే ఫోకస్ గా ఉండొచ్చు. అయితే మరి మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

కమల:

కమల లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది. బ్రెయిన్ సెల్స్ ను డామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తుంది. రోజు ఒక కమలా పండు తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

గుడ్లు:

గుడ్లలో కూడా పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలానే ఫోలేట్ లోపం నుండి కూడా బయట పడేస్తుంది.

బ్రోకలీ:                                      

బ్రోకలీ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ కె కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి బ్రోకలీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా మనం బ్రోకలీతో పొందొచ్చు.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ కూడా మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అదేవిధంగా పసుపు కూడా మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. బ్లూ బెర్రీస్, ఒమేగా త్రీ సమృద్ధిగా ఉండే చేపలు వంటివి తీసుకోవడం వల్ల కూడా మెదడు ఆరోగ్యం బాగుంటుంది. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news