పిప్పిపన్నును తీయించుకోకుండా నొప్పిలేకుండా అదే వచ్చేలా ఇలా చేయొచ్చు..!

-

ప్రపంచవ్యాప్తంగా దంతాల్లో పుచ్చుపన్ను అనేది 60-70శాతం మందికి ఉంటుంది. పన్ను అనేది ఇంతలా పుచ్చుపోవడానికి కారణం ఏంటి. మనం చేసే తప్పులే.. దంతం పైన ఉండే ఎనామిల్ అనేది దంతానికి కవచం. ఎనామిల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే…1100డిగ్రీల దాటి వేడితగిలితే తప్ప ఎనామిల్ కరగదు. నూనెల దేవినా ఎనామిల్ కరగదు. 150 సంవత్సరాలట దీని లైఫ్. పుచ్చుపన్ను వచ్చిందంటే..ఎనామిల్ దెబ్బతింటేనే వస్తుంది.

మరి ఈ ఎనామిల్ ఎందుకు దెబ్బతింటుందంటే..వైట్ ప్రొడెక్ట్స్ వల్ల.. ముఖ్యంగా పంచదార.. ఈ పంచదారలో ఉండే కెమికల్ ఎఫెక్ట్. అగ్నికూడా ఏం చేయలేదు.. కానీ ఈ పంచదార పాడుచేస్తుంది. పంచదారలో ఉన్న కెమికల్స్, పంచదారలో ఉన్న యాసిడిక్ నేచర్ ఎనామిల్ పాడేయ్యేట్లు చేస్తుంది. కూల్ డ్రింక్ 4.5PH, చాక్లెట్స్, సాల్టీ ఫుడ్స్, చల్లటి ఐస్ క్రీమ్ లు ఇవన్నీ ఎనామిల్ ను ఇరిటేట్ చేస్తాయి. డైరెక్టుగా పుల్లటి నిమ్మకాయలాంటివి.. దంతాలకు తగిలినా ఎనామిల్ దెబ్బతింటుంది. వీటితోపాటు సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల చెడ్డ బ్యాక్టిరీయాలు బాగా ఎక్కువైపోయి..గారపడతాయి. ఎప్పుడైతే ఎనామిల్ దెబ్బతిందో..లోపల ఉండే దంతం యొక్క డెంటిన్ అనే భాగం బయటపడుతుంది. అక్కడనుంచి ఇవన్నీలోపలికి వెళ్లి పంటిని పాడుచేస్తాయి. ఎప్పుడైతో పైన పొర పోయిందో..పన్నులు పాడైపోతాయి.

పుచ్చుపన్ను వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి:

పుచ్చుపన్ను ఒకసారి వచ్చిందంటే..అది రిపేర్ చేయబడదు. అది పీకడం తప్ప. మళ్లీ ఆ ప్లేస్ లో ఒరిజనల్ పన్ను డవలప్ అవడం అసాధ్యం. ఉన్న పుచ్చుపన్ను వల్ల నొప్పికలగకుండా ఉండటానికి, పుచ్చుపెరగకుండా ఉండటానికి మనం ఏం చేయొచ్చు అంటే..పుచ్చుపన్ను ఉన్నవారు స్వచ్ఛమైన తేనె చేతిలో వేసుకుని తేనెతో బ్రష్ చేయండి. ఇది పళ్ల సంధుల్లో ఉండే బాక్టిరియాను తొలగిస్తుంది. పంటిలోపల ఈ తేనె వెళ్లి..బాక్టీరియాను చంపేస్తుంది. తేనెతో బ్రషింగ్ చేయటం చాలా మంచిది. పన్నుపోటు రాకుండా ఉండటానికి, పుచ్చుపెరగకుండా ఉండటానికి ఈ బ్రషింగ్ చాలా బాగా పనికొస్తుంది. నైట్ టైమ్ కంపల్సరీ చేయండి. వేపుపుల్ల ఒక అరగంట నమిలేసి ఊయండి.

నాచురల్ ఫుడ్స్ ఎక్కువగా తినండి..పండ్లు బాగా తింటే..పుచ్చుపెరగదు. బాక్టిరియల్ గ్రోత్ ను అరికట్టడానికి పండ్లు బాగా పనిచేస్తాయి. మార్నింగ్ స్ప్రౌట్స్ తినండి. ఎంత ఎక్కువగా నాచురల్ తింటే..అంత నాచురల్ గా ఆ పుచ్చు క్లీన్ అవుతుంది.

పుచ్చుపన్ను నొప్పి తగ్గించుకోవడం..నాచురల్ గా వచ్చేలా చేయడం:

పూర్వం రోజుల్లో డెంటిస్టులు ఉండేవాళ్లు కాదు..సమస్యలు అయితే అప్పుడు కూడా ఉంటాయి..కదా. పిప్పిపన్నును పీకకుండా నాచురల్ గా వచ్చేట్లు చేయడానికి అప్పుడు ఇంగువను ఉపయోగించేవారు. రూట్ తో సహా వచ్చేట్లు ఇంగువా చేస్తుంది. పిప్పిపన్నులో పెయిన్ ఉంటుంది..ఆ నొప్పి తగ్గించడానికి ఇంగులో ఉండే రెండు కెమికల్స్ ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఆల్ఫాపైనిన్, వాలరిక్ యాసిడ్స్ ఈ రెండు కెమికల్స్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తాయి. పిప్పిపన్ను పోటు ఉన్నప్పుడు..ఇంగువను గరిటలో పెట్టి వేడిచేసి పిప్పిపన్ను లోపల పెట్టండి. నొప్పితగ్గుతుంది.

ఇక పిప్పిపన్ను పీకాల్సిన స్టేజ్ కి వచ్చినప్పుడు..పన్ను పీకాల్సిందే..కానీ చాలామందికి పన్ను పీకించుకోవాలంటే..చచ్చేభయం..నొప్పిలేకుండా పన్ను తానంతట అదే ఊడివచ్చేలా చేయడానికి కూడా ఇంగువ బాగా ఉపయోగపడుతుంది. పూర్వం రోజులనుంచే ఈ టెక్నిక్ వాడేవాళ్లు. ఇంగువ వేడి చేసి ఆ పన్నుమీద పెడుతుంటే..క్రమంగా రూట్ తో సహా పన్ను ఊడిపోయి వచ్చేస్తుంది.

2012వ సంవత్సరంలో సూరేష్ జ్ఞాన్ విహార్ యూనివర్శిటీ వాళ్లు ఇంగువతో పిప్పిపన్ను సమస్యను తొలగించుకోవచ్చు అని నిరూపించారు. మనం పూర్వం రోజుల్లో వాడారు అన్నా..ఈరోజుల్లో సైంటిఫిక్ గా నిరూపించబడితేనే వాటిని నమ్ముతాం. అలాంటి ఇంగువలో ఉండే లాభాలు పిప్పిపన్నుకే కాదు..జీర్ణక్రియకు బాగా ఉపయోగపడాతాయి, ఆకలిని బాగా పెంచడానికి, కొవ్వు కరిగించడానికి ఉపయోగపడతాయి.

ఇంకో చిట్కా నోట్లో ఉండే చెడ్డ బ్యాక్టిరియాలు, పళ్ల సంధుల్లో ఉండేవి, పొట్టప్రేగుల్లో ఉండే చెడ్డ సూక్ష్మజీవులను చంపడానికి…కరక్కయాను నీళ్లలో మరిగించి తీసుకోవచ్చు. ఎనామిల్ ను పాడుచేసే బాక్టిరియాలు ఏ‌వైతే ఉన్నాయో వాటిని చంపడానికి ఈ కరక్కాయ నీళ్లు ఉపయోగపడతాయని సైంటిఫిక్ గా 2013వ సంవత్సరంలో నిరూపించబడింది. ఈ నీళ్లను నోట్లో వేసుకుని మరిగించి పుక్కిలిస్తే..చెడ్డసూక్ష్మజీవులు 30-35 శాతం తగ్గిపోతుంది.

కరక్కాయను దగ్గుకు కూడా వాడతారు. పగలకంటే..కూడా తెల్లవారుజామున దగ్గు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అంటే..కఫ్ సిరఫ్ లు ఉన్నాయి..మరి పూర్వం రోజుల్లో అవేవి లేవుగా..నాచరలగా కరక్కాయను బుగ్గన పెట్టుకునేవాళ్లు.

మలబ్ధకానికి కూడా కరక్కయ నీళ్లు వాడొచ్చు.

దంతాలు అసలు పుచ్చకుండా ఉండాలంటే:

రెండుపూట్ల బ్రష్ చేస్తే మంచిదని కొందరు చేస్తుంటారు. ఏ పేస్టులు లేనప్పుడే దంతాలు హెల్తీగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు దంతాలుపుచ్చే వారి సంఖ్య ఎందుకు పెరుగుతుంది..ఏ పేస్ట్ కు అయినా..తాత్కాలికంగా అరగంట సేపు అక్కడున్న క్రిములను చంపుతుంది..అసలు రాకుండా, చంపడం ఏ పేస్ట్ చేయలేదు.

దంతక్షయం అసలు జరగకుండా ఉండాలంటే..చాక్లెట్స్, కూల్ డ్రింక్, స్వీట్స్, మైదాచేసిన ఆహారాలు ఇవి తినకుండా ఉండాలి. కానీ ఇవి మానమంటే..మనవల్ల అయ్యేపని కాదు.ఇవి తింటూ దంతక్షయం రాకూడదు అంటే.. డిన్నర్ తర్వాత..ఫినిషింగ్ లో.. చెరుకు ముక్కలను నమలండి. మూడునాలుగు రోజులకే మార్పు వస్తుంది. ఇందులో ఉండే తీపి చాలా మంచిది. ఇందులోని ఫైబర్ దంతాలను బలపడేడట్లు చేయడానికి, దంతం పుచ్చకుండా చేయడానికి చేస్తుంది.

దంతాలు ఆరోగ్యం చాలా మంచిది..సాధ్యమైనంత వరకూ అసలు దంతక్షయం కాకుండానే చూసుకోవాలి. వారానికి కనీసం ఒక్కసారైన వేపపుల్లతో బ్రష్ చేయడం కూడా చేస్తుంటే బాక్టిరియా అంతా పోయి నోరు ఫ్రష్ గా ఉంటుంది. ఎనామిల్ పొరను కాపాడుకోగలిగితేనే..ఈ పంటిసమస్యల నుంచి బయటపడతాం. ఒక్కసారి అది దెబ్బతిందా..మీ పనిఅయిపోయినట్లే..కాబట్టి వీలైనంత వరకూ చల్లటివి తినటం, తాగటం తగ్గించండి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news