యూరిక్ యాసిడ్ కనుక మన బ్లడ్ లో పెరిగితే దానిని హైపర్ యురేసీమియా అంటారు ఇది మోతాదు కంటే మించి ఉంటే కడుపులో మంట, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు మొదలైన ఇబ్బందులు వస్తాయి. అయితే చాలా మంది ఇటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు యూరిక్ యాసిడ్ సమస్య నుండి బయటపడడానికి ఈ చిట్కాలను ఉపయోగించవచ్చు. దానితో యూరిక్ యాసిడ్ ని కంట్రోల్ చేయడానికి అవుతుంది. మరి ఇక ఆ ఇంటి చిట్కాలను ఇప్పుడు చూసేద్దాం.
నిమ్మరసం:
నిమ్మరసం ద్వారా యూరిక్ లెవెల్స్ ని మనం తగ్గించుకోవచ్చు స్టడీ కూడా అయితే విషయాన్ని చెబుతోంది. ఆరు వారాలపాటు నిమ్మరసాన్ని తాగితే యూరిక్ ఆసిడ్ లెవెల్స్ తగ్గుతాయి.
తమలపాకు:
ఇది కూడా మ్యాజిక్ లాగ పని చేస్తుంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించడానికి తమలపాకు కూడా ఉపయోగపడుతుంది. తమలపాకు రసాన్ని తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు.
కాకరకాయ రసం:
కాకరకాయ రసం ద్వారా కూడా మనం యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు.
తిప్పతీగ:
తిప్పతీగ జ్యూస్ ని కూడా రెగ్యులర్ గా తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు ఒక గ్లాసు మంచినీళ్ళని తీసుకొని వాటిని సగం అయ్యేదాకా మరిగించి నానబెట్టిన తిప్పతీగ రసాన్ని అందులో మిక్స్ చేసి తీసుకోవచ్చు లేదంటే టాబ్లెట్లు అయినా మీరు ఉపయోగించవచ్చు.
ఈ సమస్య కలిగిన వాళ్లు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోండి:
రాత్రిపూట అన్నం తినేటప్పుడు అందులో పప్పు, బీన్స్ వంటివి వేసుకోకండి.
గోధుమను కూడా తీసుకోవద్దు.
శరీరానికి అవసరమయ్యే నీళ్లు తీసుకోవడం… ఒత్తిడికి దూరంగా ఉండడం హాయిగా నిద్ర పోవడం వంటివి చేయండి.
సిట్రస్ ఫ్రూట్స్ ని తీసుకోవడం వలన కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.