చర్మం నిగనిగ మెరవడానికి తోడ్పడే చిన్న టిప్స్..

Join Our Community
follow manalokam on social media

చర్మం సంరక్షణ కోసం పెద్దగా ఖర్చు పెట్టకుండానే మన ఇంట్లోనే రకరకాల సాధనాలను తయారు చేసుకోవచ్చు. ఈ సాధనాలు చాలా బాగా ప్రభావం చూపుతాయి కూడా. చర్మం సురక్షితంగా ఉండడానికి మార్కెట్లో దొరికే, లేదా మన ఇంట్లో తయారు చేసుకునే సాధనాలే కాకుండా మన జీవన విధానాల్లో మార్పు తీసుకురావడం ద్వారా కూడా చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. కావాల్సినంత నిద్ర, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటివి తినకపోవడం, కావాల్సినన్ని నీళ్ళు తాగడం కూడా చర్మాన్ని అందంగా ఉంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

health and beauty, resort and relaxation concept – woman in spa salon lying on the massage desk

ఐతే ఇవన్నీ కాకుండా చర్మాన్ని అందంగా, నిగనిగ మెరిసేలా తయారు చేసుకోవడానికి కొన్ని రకాల జ్యూస్ లు చాలా ఉపయోగపడతాయి. శరీరంలోని మలినాల్ని తొలగించి, మృదువుగా చేయడంతో పాటు మెరిసేలా మారుస్తాయి. ఆ జ్యూసులని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుని, ఏ విధంగా వాడుకోవాలో చూద్దాం.

రెడ్ జ్యూస్

కావాల్సిన పదార్థాలు

ఆపిల్
బీట్ రూట్
క్యారెట్

తయారు చేసే విధానం

వీటన్నింటినీ ఒకే దగ్గర మిక్స్ చేసి, పానీయంలా తయారు చేయాలి.

గ్రీన్ జ్యూస్

ధన్యాలు
పూదీన
నిమ్మ

ఈ మూడింటినీ ఒకే దగ్గర మిక్స్ చేసి జ్యూస్ లాగా తయారు చేయాలి.

ఈ రెండు జ్యూస్ లని రోజుకి ఒకసారి తాగాలి. ఒకే రోజున ఒకే సారి రెండు తాగడం కంటే ఒకటి పొద్దున్న తాగి మరో జ్యూస్ ని సాయంత్రం తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నిగనిగలాడే చర్మం మీ సొంతం అవుతుంది.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...