ఈ గింజలతో కీళ్ల నొప్పులని తగ్గించుకోండి..!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలు కీళ్ళ నొప్పులు ఒకటి. అయితే మీరు కూడా కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..? కీళ్లనొప్పుల నుంచి బయట పడాలని అనుకుంటున్నారా..? అయితే ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. దీనిని కనుక ఫాలో అయితే కచ్చితంగా మీ కీళ్ల నొప్పులు సమస్య నుంచి బయట పడవచ్చు.

మిరప గింజల లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. అలాగే ఈ మిరప గింజలు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. తలనొప్పి వంటి సమస్యలని కూడా ఇది తొలగిస్తుంది. అయితే కీళ్ల నొప్పులు తగ్గించడానికి మీరు మిరప గింజలలో నీళ్ళు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీనిని నుదుటి మీద అప్లై చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

అలాగే కండరాల నొప్పులు, కీళ్ల నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది. మీకు నొప్పి ఎక్కడ ఉందో అక్కడ ఈ పేస్ట్ ని అప్లై చేస్తే నొప్పులు పూర్తిగా తగ్గుతాయి. ఇదిలా ఉంటే మిరపగింజల లో మిరియాలు వేసి నూనె లేదా నెయ్యి లో బాగా మాడ్చాలి.

దానిని వడకట్టి నొప్పులు ఉన్న ప్రదేశంలో మసాజ్ చేస్తే కూడా ఉపశమనం లభిస్తుంది. మిరప గింజల్ని మెత్తగా పొడిచేసి ఒక గ్లాసు నీటిలో ఆ పొడి కలిపి తాగితే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఏదైనా సమస్యలు నుండి ఈ గింజలు బయట పడేస్తాయి.