వేసవి లో డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే వీటిని అనుసరించండి..!

-

వేసవి కాలం మొదలైన దగ్గర నుండి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఇలా వాతావరణం లో మార్పులు రావడమే కాకుండా శరీరంలో కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ శరీరానికి అవసరమైనంత మంచి నీరు తీసుకోవడం అవసరమే. హైడ్రేట్ చేయడానికి మంచినీరు మాత్రమే కాకుండా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఇలా ఎటువంటి ఫ్లూయిడ్స్ నైనా మీరు తరచుగా తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితులు వస్తే మాత్రమే బయటకు వెళ్లండి. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, జ్వరం, స్కిన్ బర్న్ వంటి సమస్యలకు మీరు గురవుతారు.

- Advertisement -

ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు పాటించడం మర్చిపోకండి. బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్ లోషన్ ను ముఖానికి మరియు చేతులకు అప్లై చేసుకోండి. అదే ఎక్కువ సేపు బయట ఉండాల్సిన అవసరం ఉంటే హానికరమైన యూవీ కిరణాల నుండి మీ చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ ను మీతో పాటు తీసుకెళ్లండి, క్రమంగా అప్లై చేసుకోండి.

గుర్తుంచుకోండి సమ్మర్ సీజన్ లో అతి పెద్ద సమస్య డీహైడ్రేషన్ మిగిలిన సీజన్స్ తో పోలిస్తే సమ్మర్ లో మంచి నీరు ఎక్కువ తాగితేనే మంచిది. కాబట్టి అవసరమైనంత మంచి నీరు తాగండి. ఎక్కువ నీరు శాతం ఉండేటువంటి కమల, పుచ్చకాయ, కీరదోస, నిమ్మ వంటివి తీసుకోండి. పండ్లు తినలేకపోతే ఎటువంటి పండ్ల రసాలు అయినా తీసుకోవచ్చు. ఇలా చేస్తే డీహైడ్రేషన్ నుండి మీరు విముక్తి పొందవచ్చు.

సమ్మర్ సీజన్ లో ఎక్కువగా కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల హైడ్రేషన్ కు గురవుతారు. అంటే కాఫీ, టీ మరియు ఆల్కహాల్ ను తగ్గించడం చాలా మంచిది. వీటికి బదులు హైడ్రేట్ చేసేటటువంటి పండ్ల రసాలు తీసుకోండి. వేసవికాలంలో వేడి నీళ్ల తో స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది కాబట్టి చల్లని నీటితో స్నానం చేసి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి. బయటకు వెళ్లే ముందు గొడుగు లేదా క్యాప్ వంటివి ధరించండి. చాలా మంది అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు, అలాంటప్పుడు ఆహారాన్ని తినడం మానేయకుండా లైట్ గా తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...