పెరట్లో దొరికే ఈ ఆకు రసం తాగితే చాలు.. కిడ్నీల్లోని ఎంత పెద్ద రాళ్లయినా ఇట్టే కరగాల్సిందే..!

-

లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోలేక కిడ్నీ సమస్యలతోనే కాలం వెళ్లదీస్తున్నవారు కోకొల్లలు. ఎటువంటి కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లలయినా.. రూపాయి ఖర్చు లేకుండా కిడ్నీ సమస్యలు చివరి స్టేజీలో ఉన్న ఒక ఆకు రసంతో నయం చేసుకోవచ్చు.

ప్రస్తుత ఆహారం పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఏది తిన్నా కల్తే. అంతా కెమికల్ ఫుడ్డే. ఏది తింటే ఏ రోగం వస్తుందోనని భయపడుతూ బతకాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. ప్రతి 10 మందిలో తొమ్మది మందిని షుగర్, బీపీ, ఇతర సమస్యలు వేధిస్తున్నాయి. వాటితో పాటు చాలామంది కిడ్నీ సమస్యలతోనూ నేడు బాధపడుతున్నారు. కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, కిడ్నీలలో రాళ్లు ఏర్పడటం.. లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు.

లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోలేక కిడ్నీ సమస్యలతోనే కాలం వెళ్లదీస్తున్నవారు కోకొల్లలు. అందుకే.. అటువంటి వాళ్ల కోసమే ఈ కథనం.

ఎటువంటి కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లలయినా.. రూపాయి ఖర్చు లేకుండా కిడ్నీ సమస్యలు చివరి స్టేజీలో ఉన్న ఒక ఆకు రసంతో నయం చేసుకోవచ్చు. ఆకు రసం అనగానే మీరు పక్కున నవ్వి ఉంటారు కానీ… ఈ ఆకు గురించి మీకు తెలియదు. చాలామంది ఇప్పటికే ఈ ఆకు రసం తాగి తమ కిడ్నీ సమస్యలను పోగొట్టుకున్నారు. కిడ్నీల్లో పెరిగిన ఎంత పెద్ద రాళ్లనయినా ఈ ఆకు రసం ఇట్టే కరిగించేయగలదు.

అదే అటిక మామిడి ఆకు. దీన్నే అంటుడుకాయ మొక్క అని కూడా అంటారు. ఊళ్లలో ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తాయి. ఇది మన పెరట్లోనే పెరుగుతుంది. మన పెరట్లోనే మన ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స ఉన్నప్పటికీ మనం పెద్దగా పట్టించుకోం. ఇంగ్లీష్ వైద్యమే మనకు ఇష్టం. మన పూర్వీకులు ఏ ఇంగ్లీష్ వైద్యం చేయించుకొని వందేళ్లు బతికారు చెప్పండి. వాళ్లు దేనికైనా పెరట్లోని చెట్లే వాళ్ల వైద్యం. చెట్ల వైద్యంతోనే వాళ్లు పది కాలాల పాటు చల్లగా బతికారు అనే విషయాన్ని మనం మరిచిపోయాం.

అటిక మామిడి రసం ఎలా చేయాలంటే?

మీ పెరట్లోనే ఉన్న అటిక మామిడి చెట్టు మొత్తం ఔషధ గుణాలతో ఉన్నదే. చెట్టు ఆకులే కాదు.. చెట్టు వేర్లు, కాండం, పువ్వులు, రెమ్మలు అన్నీ తెంపి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముందుగా కొన్ని నీళ్లను తీసుకొని (200 మిల్లీలీటర్లు) ఒక గిన్నెలో పోసి.. సన్నని మంట మీద ఓ ఐదు నిమిషాలు కాగ బెట్టండి. నీళ్లు బాగా కాగాక.. సన్నగా ముక్కలు చేసిన అటిక మామిడి ముక్కలను ఆ నీళ్లలో వేయండి. అలాగే అవి కాసేపు నీళ్లలో మరిగాక.. వాటి సారం నీళ్లలో దిగాక ఆ నీటిని వడబోయండి. రోజు ఉదయమే పరిగడుపున 50 మిల్లీలీటర్ల రసాన్ని తాగితే చాలు.

ఈరసాన్ని ఎవరు తాగొచ్చు?

ఎవరైనా తాగొచ్చు. కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నవాళ్లు.. సమస్యలు వస్తాయనుకునేవాళ్లు.. ఎవరైనా తాగొచ్చు. కిడ్నీ సమస్యలతో బాధపడుతూ.. డయాలసిస్ చేయించుకునేవాళ్లు, కిడ్నీ సమస్యల కోసం ఇంగ్లీష్ మందులు వాడేవాళ్లు కూడా వాడొచ్చు. అటిక మామిడి ఆకులను ఇంగ్లీష్ కిడ్నీ మందుల తయారీలోనూ ఉపయోగిస్తారట. అంతటి ఔషధ గుణాలు ఉన్న అటిక మామిడితో సింపుల్ గా కిడ్నీ సమస్యలను రూపుమాపుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news