బంగాళదుంపలతో ఈ సమస్యలకి చెక్..!

-

కేవలం మంచి ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి మాత్రమే కాదు బంగాళదుంప(Potato) ల వల్ల మరెన్నో బెనిఫిట్స్ మనం పొందొచ్చు. చర్మానికి, జుట్టుకు కూడా బంగాళదుంప ఎంతో మేలు చేస్తుంది. బంగాళదుంప నుండి వచ్చే సారం నిజంగా ఆరోగ్యాన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అయితే మరి ఇంక ఆలస్యం ఎందుకు వీటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

మచ్చలు, డార్క్ స్పాట్స్ తగ్గుతాయి:

బంగాళదుంపని ఉపయోగించడం వల్ల ముఖం పై మచ్చలు వంటివి పోతాయి. చాలా మంది డార్క్ స్పాట్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్లు కొద్దిగా తేనెలో బంగాళాదుంప రసం వేసుకుని మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి… 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత కడిగేసుకుంటే మచ్చలు పోతాయి.

యాక్నీ సమస్య ఉండదు:

యాక్నీ తొలగించడంలో కూడా బంగాళదుంప బాగా ఉపయోగపడుతుంది. యాక్నీ సమస్యతో బాధ పడే వాళ్ళు ముఖమంతా కూడా బంగాళదుంప రసాన్ని అప్లై చేసుకుని కాసేపు పాటు అలా వదిలేస్తే మంచి గ్లో వస్తుంది. అదేవిధంగా యాక్నీ సమస్యలు కూడా ఉండవు.

డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి:

డార్క్ సర్కిల్స్ పోవడానికి బంగాళదుంప బాగా ఉపయోగపడుతుంది దీని కోసం మీరు ఒక బంగాళదుంపని ముక్కల కింద కోసుకుని దానిని కళ్ళ కింద పెట్టుకుంటే సరిపోతుంది.

మంచి షైనింగ్ జుట్టు పొందొచ్చు:

కొన్ని బంగాళాదుంపల్ని తొక్క తీసేసి ఉడికించి.. ఆ నీళ్లతో హెయిర్ వాష్ చేస్తే జుట్టు షైనింగ్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version