జుట్టు రాలిపోతోందా? టెన్షన్ పడకుండా ఈ చిట్కాలను ఫాలో అవండి..

-

జుట్టు రాలిపోవడం అనే చాలా సహజం. కానీ.. కొందరు మాత్రం చాలా భయపడిపోతారు. వామ్మో.. జుట్టు రాలిపోతోంది ఎలా.. మగవాళ్లయితే బట్టతల వస్తుందేమో అని టెన్షన్ పడుతుంటారు. యువతులు, మహిళలు కూడా జుట్టు రాలే సమస్యతో భయపడుతుంటారు. కొంతమందికి మాత్రం తలలో దువ్వెన పెట్టగానే పెచ్చులు పెచ్చులుగా జుట్టు రాలిపోతుంది. ఇలా… జుట్టు రాలే సమస్యతో బాధపడేవాళ్లు ఇంట్లోనే అద్భుతమైన చిట్కా ఫాలో అయ్యారంటే.. మీ జుట్టు ఊడిపోవడం తగ్గడమే కాదు.. జుట్టు ఇంకా ఒత్తుగా పెరుగుతుంది.

దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. కొంచెం కొబ్బరినూనె తీసుకోండి. ఆ కొబ్బరి నూనెలో మందార పూలను వేయండి. రెండింటినీ బాగా మరగబెట్టండి. తర్వాత చల్లార్చండి. ఆ నూనెను ప్రతి రోజు తలకు పట్టించండి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు ఈ నూనెను వాడితే జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ చిట్కాను మీ ఇంట్లో పాటించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version