వెల్లుల్లి రెబ్బతో టాయిలెట్ క్లీన్ ..ఒక్క రాత్రిలోనే కంప్లీట్ ఛేంజ్..!

-

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందిరికి తెలిసిన విషయమే. వెల్లుల్లి వంటల్లోనే కాదు, క్లీనింగ్ లో కూడా ఉపయోగడుతుందని మీకు తెలుసా..క్రిములను హతమార్చటంలో నంబర్ వన్ గా పనిచేస్తుందట. ఇంట్లో ఉండే అన్ని గదుల్లో కంటే బాత్రుమ్ లోనే ఎక్కువగా క్రిములు ఉంటాయి. మనం సోకాల్డ్ ప్రొడక్ట్స్ తెచ్చి క్లీన్ చేస్తాం. మంచి సువాసన వస్తుంది. శుభ్రం కూడా అవుతుంది..కానీ మళ్లీ మరసటి రోజునుంచే అదేతంతు మొదలవుతుంది.

వెల్లుల్లిలో ఎల్లిసిన్ అనేది ఉంటుంది. దీనివల్ల వెల్లుల్లిలో ఒక ప్రత్యేక వాసన వస్తుంది. ఇదే బ్యాక్టీరియా అంతు చూస్తుంది. బాత్ రూమ్‌లో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటిని తొలగిస్తుంది. వెల్లుల్లితో ఇలా చేస్తే బాత్రుమ్ తళతళా మెరిసిపోతుందట. ఒక్కసారి చేస్తేనే రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ముందురోజు రాత్రి బాత్‌రూంలో ఓ వెల్లుల్లి రెబ్బలను వేయండి. అక్కడ తడి వాతావరణంలో అది రాత్రంతా ఉండాలి. తెల్లారే ఆ వెల్లుల్లి రెబ్బలను బాత్‌రూంలో రుద్దేయండి. అప్పటికే అక్కడి చెడు వాసన పోవడమే కాదు బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

ఇలా కూడా చేయొచ్చు

ఓ గిన్నెలో నీళ్లు పోసి సలసలామరిగే వరకు ఉడకనివ్వండి. అందులో ఓ 3 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వెయ్యండి. ఓ నిమిషం తర్వాత స్టవ్ ఆపేయండి. నీరు గోరువెచ్చగా అయ్యాక ఆ నీటిని బాత్‌రూమ్‌లో చల్లండి. రాత్రంతా అలా వదిలేయండి. తెల్లారే బ్రష్‌తో తుడిచేయండి. అంతే
అవాక్కయ్యారా యాడ్ లో లా మొత్తం క్లీన్ అయిపోతుంది.

బాత్‌రూంలో చెడు వాసనలు రావడానికి కారణం బ్యక్టీరియానే. వెల్లుల్లి పాయలో ఉండే ఎల్లిసిన్ ఆ బ్యాక్టీరియాని చంపడమే కాదు..దుర్వాసనను కూడా పోగొడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు మరీ. మీరు ఓ సారి ట్రై చేసి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news