వంటింట్లో ప్లాస్టిక్ కి బదులు గాజు సీసాలని ఉపయోగిస్తే సరి..!

-

వంటింట్లో పప్పులు. ఉప్పులు నుండి మసాలా సామాన్ల వరకు వంటకి ఎన్నో అవసరం అవుతాయి. వీటిని జాగ్రత్తగా ఆడవాళ్లు స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అయితే వంటింట్లో కొందరు ప్లాస్టిక్ డబ్బాలు వాడితే కొందరు గాజుసీసా(Glass bottle) లని వాడతారు. అయితే ఈ రెండిట్లో ఏది వాడితే మంచిది అనేది ఇప్పుడు మనం చూద్దాం.

సాధారణంగా ప్లాస్టిక్ అనేది ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వీలైనంత వరకు ప్లాస్టిక్ తక్కువ ఉపయోగించడం మంచిదని చాలాసార్లు ఎందరో చెప్పడం మనం వినే ఉంటాం. అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలంటే కచ్చితంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అయితే ప్లాస్టిక్ సీసాలు కంటే గాజుసీసాలో వాడడం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

గాజు సీసాలు ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు :

ఆరోగ్యానికి మంచిది:

సాధారణంగా ఇంట్లో ఉపయోగించే ప్లాస్టిక్ సామాన్లని పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తో తయారు చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకు BPA వంటివి ఉంటాయి. ఇది హృదయ సంబంధిత సమస్యలతో లింక్ అయి ఉంటుంది. ఈ బీపీఏ అనేది బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్లిపోతుంది. దీని ద్వారా ఇన్ఫెర్టిలిటీ, మెటబాలిజం లో సమస్యలు ఇలా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

గాజు సౌకర్యంగా ఉంటుంది:

గాజుని స్టోర్ చేయడానికి, ఫ్రీజ్ లో పెట్టడానికి లేదా మైక్రోవేవ్ లో ఉపయోగించడానికి కూడా బాగుంటుంది. 100% బోరోసిలికేట్ గ్లాస్ ఫ్లేవర్ ని ప్రిజర్వ్ చేస్తుంది.

పర్యావరణ హానీ ఉండదు:

ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. గాలి కాలుష్యం వంటి వాటికి కూడా ప్లాస్టిక్ దారితీస్తుంది. ప్లాస్టిక్ నుండి గాజుకి మారడం వల్ల సురక్షితం.

ఇబ్బంది ఉండదు:

అదే విధంగా గాజు సీసాల్లో వేయడం వల్ల అందులో ఏం వేశారు అనేది క్లియర్ గా కనబడుతుంది దీనితో వంట చేసే సమయంలో వేగంగా మనం వాటిని తీసుకోవచ్చు. ఇలా గాజుసీసాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news