బాగా నిద్ర పట్టాలంటే ఈ నూనెల్ని వాడండి..!

ఇంట్లో మంచి సువాసన ఇచ్చే నూనెలను చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల ప్రశాంతంగా ఉండొచ్చు. అలానే మంచి మూడ్ ని కూడా ఇస్తుంది. అయితే మరి రాత్రిపూట చక్కగా నిద్ర పట్టాలంటే ఈ నూనెలను ఉపయోగించండి. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల చాలా ప్రయోజనాలని పొందవచ్చు. అయితే మరి వాటి కోసం ఇప్పుడు తీసుకుందాం.

 

rose-oil

సాండిల్ వుడ్ ఆయిల్:

మంచి సువాసనని ఇది ఇస్తుంది. అలానే చక్కటి ప్రయోజనాలు కూడా మనం పొందొచ్చు. ఈ నూనెలో మూడ్ ని బ్యాలెన్స్ చేసే గుణాలు ఉంటాయి. అలానే ఇది మనసుని ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. ఇలా శాండిల్ వుడ్ ఆయిల్ వల్ల మనం చక్కగా నిద్రపోవడానికి వీలవుతుంది.

రోజ్ ఆయిల్:

రోజ్ ఆయిల్ కూడా మంచి సువాసనతో ఉంటుంది. ఇది మంచి ఎనర్జీని ఇస్తుంది. అలానే నిద్ర యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది.

జాస్మిన్ ఆయిల్:

రోజులో మనం ఎంతగానో అలసిపోతుంటాము. ఆ ఒత్తిడిని తగ్గించి.. మంచి మూడ్ ని, ప్రశాంతతని ఇస్తుంది ఇది. కాబట్టి దీనిని కూడా రాత్రి ఉపయోగిస్తే మంచిది.

యూకలిప్టస్ ఆయిల్:

యూకలిప్టస్ ఆయిల్ ఎంతో సువాసనతో ఉంటుంది. మంచి నిద్రని పొందడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలానే మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచుతుంది.

లావెండర్ ఆయిల్:

లావెండర్ ఆయిల్ కూడా మంచి నిద్రకు సహాయం చేస్తుంది. కాబట్టి మంచి నిద్రను పొందడానికి దీనిని కూడా మీరు ఉపయోగించి. ప్రశాంతంగా, హాయిగా ఉండచ్చు.