ప్రధాని చేతుల మీదుగా సన్సద్ టీవీ ప్రారంభం.. నేడే

-

లోక్ సభ, రాజ్యసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సన్సద్ టివీ ప్రారంభం కానుంది. ఇది వరకు ఈ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలకు రాజ్యసభ, లోక్ సభ పేరుతో రెండు ప్రత్యేక ఛానెళ్ళు ఉండేవి. ప్రస్తుతం ఈ రెండింటిని కలిపి సన్సద్ టీవీ ఛానెల్ ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం 6గంటలకు లాంచింగ్ కార్యక్రమం జరగనుంది.

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం రోజున ప్రారంభం కాబోతున్న ఈ ఛానెల్ లో ప్రసారాలు నాలుగు విభాగాలుగా ఉండనున్నాయి. పార్లమెంట్ కార్యకలాపాలు, పథకాలు, భారతీయ చరిత్ర సంస్కృతి, పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను ప్రసారం చేయనున్నారు. ఈ సన్సద్ టీవీ ఛానల్ కు సీఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ రవి కపూర్ ను కేంద్రం నిర్ణయించింది. మొత్తానికి రెండు ఛానెళ్ళ స్థానంలో సన్సద్ ఒక్కటే వచ్చిందన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news