ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే శాకాహార పదార్ధాలు..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం, మంచి జీవన విధానాన్ని అనుసరించడం లాంటివి చేయాలి. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారం తీసుకోవాలని… దానిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని… అయితే దీనిలో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.శాకాహారులు కూడా శాకాహారంతోనే మంచి ప్రోటీన్స్ ని పొందొచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ అందుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.

ప్రొటీన్ అధికంగా వుండే శాఖాహార పదార్ధాలు:

బఠానీ:

బఠానీలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. కనుక దీన్ని డైట్ లో తప్పకుండా తీసుకోవాలి.

టోఫు:

ప్రోటీన్ ఎక్కువగా టోఫు లో కూడా ఉంటుంది. ఇది చూడడానికి చీజ్ లాగ ఉంటుంది. దీనికి ఎటువంటి రుచి ఉండదు. మీరు పన్నీర్ తో తయారు చేసుకునే వంటకాలు లాగే దీనిని కూడా తయారు చేసుకోవచ్చు. దీనిలో ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి.

పప్పులు:

మనం తరచుగా ఉపయోగించే పద్ధతులులో కూడా ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. కనుక శాఖాహారులు వీటిని కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. ఇలా వీటిని తీసుకోవడం వల్ల శాకాహారులకు ప్రోటీన్స్ అందుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news