చింత గింజలను వృధాగా పడేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి..!

-

పులిహోర నుండి పచ్చళ్ళ వరకు చింతపండు లేనిదే పని ఒక పూట కూడా గడవదు.. కొంచెం తీయగా పుల్లగా ఉండే ఈ రుచికి ఫిదా అవ్వని వారు లేరంటే నమ్మ శక్యం కాదు.. అందుకే మన వంటిళ్లలో ప్రత్యేకంగా చింతపండుకి ఒక స్థానం వుంది. ఇది రుచికి మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో ఉండే ఫైటో న్యూట్రియన్స్ వల్ల బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫోటో న్యూట్రియన్స్ వల్ల బాడీ హెల్దీగా ఉంటుంది అలాగే ఇందులో ఉండే టార్టారిక్ యాసిడ్ ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్.. ఇది ఫ్రీ రాడికల్స్ పెరగకుండా నిరోధిస్తుంది ఇక చింతపండుకున్న ఇతర ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే..

చింతపండు మెడబాలిజం ని స్టిములేటు చేస్తుంది జీర్ణ వ్యవస్థను బలంగా మారుస్తుంది చింతపండులో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

డయాబెటిస్ ను తగ్గించడంలో కూడా చింతగింజలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది రక్తంలోని చక్కర నిల్వలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెంచుతాయి.

చింత గింజలలో అన్ శాచురేటెడ్ ఫ్యాట్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది.ఇవి కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే ఈ గింజలలో ఉండే యాసిడ్స్ గుండె వ్యాధులను అరికడతాయి.

అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తాయి. ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి. అయితే చింత గింజలను ఎలా వాడాలి,ఎంత మోతాదులో వాడాలి అనేది ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకుంటే చాలా మంచిది. వృధాగా పారబోసి ఈ చింత గింజలను మీరు ఇలా గనుక ఉపయోగించినట్లయితే కచ్చితంగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news