వాకింగ్.. లేదా రన్నింగ్.. రెండింటిలో నిత్యం ఏది చేసినా మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. వీటి వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. అలాగే ఇతర లాభాలు కూడా ఉంటాయి. అయితే బరువు తగ్గేందుకు, ఆరోగ్యంగా ఉండడానికి వాకింగ్ చేయాలా లేదా రన్నింగ్ చేయాలా ? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. మరి ఈ రెండింటిలో ఏది చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాకింగ్ వల్ల శరీరంపై భారం ఎక్కువగా పడదు. వాకింగ్ చాలా తేలికైన వ్యాయామం. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎవరైనా సులభంగా వాకింగ్ చేయవచ్చు. ఇందుకు ప్రత్యేక పరికరాలు, సామగ్రి అవసరం లేదు. అయితే వాకింగ్ వల్ల ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నప్పటికీ రన్నింగ్ వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. రన్నింగ్ వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. కానీ భారీకాయం ఉన్నవారు మొదట్లోనే రన్నింగ్ చేయరాదు. వాకింగ్‌తో ప్రారంభించాలి. బరువు తగ్గే కొద్దీ రన్నింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు.
ఇక అధిక బరువు సమస్య లేని వారు, ఇతర ఏ అనారోగ్య సమస్య లేనివారు రన్నింగ్ చేయవచ్చు. దీని వల్ల వాకింగ్ కన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. అయితే గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు వాకింగ్ చేయడమే ఉత్తమం. అందువల్ల వాకింగ్, రన్నింగ్.. రెండింటిలో ఏది చేయాలో డిసైడ్ చేసుకోవడం ఇక మీ వంతు..!