ఉన్నట్టుండి వ్యాయామం చేయడం మానేస్తే..నిజంగా డేంజరేనా..?

-

ఉద్యోగం పురుష లక్షణం అన్నట్లు.. వ్యాయామం చేయడం ఆరోగ్యవంతుని లక్షణం. రోజు కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయమం చేస్తే.. బరువు కంట్రోల్లో ఉంటుంది. సమస్యలు దూరంగా ఉంటాయి. సరే మంచిదని డైలీ క్రమం తప్పకుండా చేశాం.. కానీ కుదరక సడన్గా ఆపేస్తే.. ఏమవుతుంది. చాలామంది.. జిమ్‌కు వెళ్లి మానేస్తే..బరువు పెరిగిపోతారు అంటారు.. ఇందులో ఎంత నిజం ఉంది. అసలు వ్యాయామం చేయడం ఆపేస్తే వచ్చే నష్టాలేంటి..? నిపుణులు ఏం అంటున్నారు..?
రోజువారి వ్యాయామాలను అర్ధాంతరంగా మానేయటం వల్ల అనర్ధాలు తప్పవంటున్నారు నిపుణులు. అకస్మాత్తుగా వ్యాయామాలు ఆపేయడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి, బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. 15 రోజుల పాటు వ్యాయామం మానేసినా కండరాల మోతాదు తగ్గుతోందని, కొవ్వు శాతం పెరిగిపోతోందని అధ్యయనాల్లో తేలింది. ఇంకా వ్యాయామం ఆపేయడం మూలంగా మధుమేహం, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక సమస్యల ముప్పూ ఎక్కువవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం మానేసిన సమయంలో రక్తపోటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. సడన్‌గా వ్యాయామం మానేస్తే శ్వాస సమస్యలు అధికమవుతాయట.
వ్యాయామాన్ని సడన్‌గా ఆపేయడం వలన మెదడులో చురుకుదనం తగ్గుతుంది.. మునుపు ఉన్నంత యాక్టివ్‌గా ఉండలేరు.. ప్రతిదానికి బద్దకం తోడవుతుంది. మీరే మార్పును కళ్లారా చూస్తారు. ఏది చేయాలన్నా నీరసం, బద్దకం అసలు యాక్టివ్‌గా ఉండలేరు. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల మనసు ఆహ్లాదంగా మారుతుంది. నిరాశ, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
వ్యాయామాలు అపేయటం వల్ల ఒత్తిడి అధికమౌతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరంలోని కండరాలు వ్యాయామాల మధ్యలో అపేయటం వల్ల పటుత్వాన్ని కోల్పోవడంతో పాటుగా శరీరంలో కెలరీలు కూడా చాలా తక్కువగా ఖర్చువుతాయి. కండరాలు నొప్పిగా, అలసటగా అనిపించి నీరసం వస్తుంది. కాబట్టి వారానికి నాలుగు రోజులైన వ్యాయామం చేయాలని రూల్‌ పెట్టుకోండి. కుదిరితే ఉదయం..లేదంటే సాయంత్రం ఏదో ఒక టైంలో అరగంట పాటైన వ్యాయామం చేస్తుంటే..ఎలాంటి సమస్యలు రావు.

Read more RELATED
Recommended to you

Latest news